Tollywood : షర్ట్ లేకుండా యంగ్ హీరో ఫోటో.. బాడీ మీద గేమ్ ఆడుతోన్న నెటిజన్స్..
వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ వంటి హిట్ చిత్రాల్లో నటించిన సందీప్.. కొన్నాళ్లుగా వరసుగా డిజాస్టర్స్ అందుకున్నారు. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కించిన మైఖేల్ చిత్రం కూడా ఈ హీరోను నిరాశ పరిచింది. కాగా ఇటీవల విడుదలైన ఊరు పేరు భైరవకోన మూవీ మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ మూవీతో మళ్లీ ఫాంలోకి వచ్చాడు సందీప్. ఇక ఇప్పుడు ఈ హీరో చేతిలో నాలుగైదు సినిమాలు ఉన్నట్లు సమాచారం.

టాలీవుడ్ ఇండస్ట్రీలోని యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోలలో సందీప్ కిషన్ ఒకరు. రోటీన్ ఫార్మాట్ మూవీస్ కాకుండా ఎప్పటికప్పుడు సరికొత్త కథలతో.. వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులకు ముందుకు వస్తుంటాడు. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా విభిన్నమైన కంటెంట్ కథలతో రిస్క్ చేసేందుకు ముందుంటాడు. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ వంటి హిట్ చిత్రాల్లో నటించిన సందీప్.. కొన్నాళ్లుగా వరసుగా డిజాస్టర్స్ అందుకున్నారు. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కించిన మైఖేల్ చిత్రం కూడా ఈ హీరోను నిరాశ పరిచింది. కాగా ఇటీవల విడుదలైన ఊరు పేరు భైరవకోన మూవీ మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ మూవీతో మళ్లీ ఫాంలోకి వచ్చాడు సందీప్. ఇక ఇప్పుడు ఈ హీరో చేతిలో నాలుగైదు సినిమాలు ఉన్నట్లు సమాచారం.
త్వరలోనే ధనుష్ నటిస్తున్న రాయన్ చిత్రంలో కనిపించనున్నాడు. అలాగా మాయ వన్ సినిమా.. ధమాకా డైరెక్టర్ త్రినాథ రావు నక్కిన దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నాడు. ఇదంతా పక్కన పెడితే తాజాగా సందీప్ కిషన్ షర్ట్ లేకుండా ఓ ఫోటోను నెట్టింట షేర్ చేశాడు. తన బాడీని చూపిస్తూ కింద పడుకుని ఫోటోకు ఫోజిచ్చాడు. సందీప్ షేర్ చేసిన ఫోటోస్ నెట్టిటం వైరలవుతున్నాయి.
Soaking in the Sun & Love ♥️
On the Sets of #MaayaOne pic.twitter.com/ygnidEDFR2
— Sundeep Kishan (@sundeepkishan) May 5, 2024
ఈ క్రమంలోనే కొందరు నెటిజన్స్ సందీప్ కిషన్ బాడీ మీద క్రిస్ క్రాస్ గేమ్ ఆడుతున్నారు. ఒకరి తర్వాత ఒకరు సందీప్ బాడీ మీద క్రాస్ మార్క్స్.. సర్కిల్స్ వేస్తూ గేమ్ ఆడుతున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోస్ ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి. అయితే ఈ ఫోటోలను ఓ మీమర్ తన ఇన్ స్టాలో షేర్ చేస్తూ ఇది చాలా ఫన్నీగా ఉందంటూ కామెంట్ చేశాడు.
— Pavan Sirisin (@SirisinSpeaks) May 5, 2024
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.