సుధీర్ తో కెమిస్ట్రీపై ఒక్క మాటతో తేల్చేసిన రష్మి..
సుడిగాలి సుధీర్, రష్మీ గౌతమ్ ల గురించి వచ్చిన రూమర్స్, గాసిప్స్ అన్నీ, ఇన్నీ వావు. టీవీ ప్రొగ్రామ్స్ లో తెగ హడావిడి చేస్తోన్న ఈ జంట..మంచి కెమిస్ట్రీ మెయింటైన్ చేస్తూ ఎప్పుడూ వార్తల్లో ఉంటున్నారు. దాదాపు ఏడేళ్లుగా వీరిద్దరు ఏదో రిలేషన్ ఉన్నట్లు బిల్డప్ ఇస్తూ నిత్యం మీడియాలో, వార్తాల్లో నానుతూ ఉంటున్నారు. తాజాగా అన్ని సినిమా, సీరియల్స్ షూటింగ్స్ తో పాటే జబర్దస్త్ షో ఆగిపోయింది. దీంతో ఆర్టిస్టులంతా ఇళ్లకే పరిమితం అయ్యి..హోమ్ క్వారంటైన్ […]

సుడిగాలి సుధీర్, రష్మీ గౌతమ్ ల గురించి వచ్చిన రూమర్స్, గాసిప్స్ అన్నీ, ఇన్నీ వావు. టీవీ ప్రొగ్రామ్స్ లో తెగ హడావిడి చేస్తోన్న ఈ జంట..మంచి కెమిస్ట్రీ మెయింటైన్ చేస్తూ ఎప్పుడూ వార్తల్లో ఉంటున్నారు. దాదాపు ఏడేళ్లుగా వీరిద్దరు ఏదో రిలేషన్ ఉన్నట్లు బిల్డప్ ఇస్తూ నిత్యం మీడియాలో, వార్తాల్లో నానుతూ ఉంటున్నారు.
తాజాగా అన్ని సినిమా, సీరియల్స్ షూటింగ్స్ తో పాటే జబర్దస్త్ షో ఆగిపోయింది. దీంతో ఆర్టిస్టులంతా ఇళ్లకే పరిమితం అయ్యి..హోమ్ క్వారంటైన్ లో ఉంటున్నారు. మధ్యమధ్యలో సోషల్ మీడియాలో నెటిజన్లను కూడా పలకరిస్తున్నారు. ఈ క్రమంలో జబర్దస్త్ బ్యూటీ రష్మీ ఆస్క్ రష్మీని ట్విట్టర్‌లో ప్రారంభించింది. ఈ సందర్భంగా నెటిజన్స్ రష్మీకి అనేక రకాల ప్రశ్నలకు ఆన్సర్స్ ఇస్తోంది. ఇష్టమైన వ్యక్తలు, వ్యక్తులు, ఫుడ్ ఇలా ఆమెను అన్ని రకాలు ప్రశ్నలు అడుగుతున్నారు. ఈ క్రమంలో ఓ నెటిజన్ మాత్రం సుడిగాలి సుధీర్ గురించి అడిగాడు.
సుడిగాలి సుధీర్ గురించి ఒక్క మాటలో ఏం చెప్తారూ అంటూ ఆస్క్ రష్మీలో భాగంగా రష్మీని అడిగాడు. ఈ ప్రశ్నకు బదులిస్తూ ఈ భామ… అతడితో కలిసి వర్క్ చెయ్యడం ఓ అద్భుతం అంటూ ఆన్సర్ ఇచ్చింది. కాగా రష్మీ, సుధీర్ డేటింగ్ లో ఉన్నారని… వారు పెళ్లి చేసుకుంటారని కూడా గతంలో వార్తలు కూడా వచ్చాయి. కానీ వీటిని పూర్తిగా ఖండిస్తే అటు స్మాల్ స్క్రీన్ పై కెమిస్ట్రీ వర్కవుట్ అవ్వదని..ఒకవేళ చెప్తే లేనిపోని ఇబ్బందులు ఎదురవుతాయని..ఆ రూమర్స్ అలా మెయింటైన్ చేస్తూ ముందుకు వెళ్తున్నారు ఈ జోడి.
Amazing to work with https://t.co/qbASeZ1gN1
— rashmi gautam (@rashmigautam27) April 14, 2020




