నందినిరెడ్డి డైరెక్ష‌న్ లో చైతూ..హీరోయిన్ ఎవ‌రంటే..?

స‌మంత ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన మూవీ `ఓ బేబీ`. కొరియ‌న్ సినిమా `మిస్ గ్రానీ` సోల్ తో ఈ మూవీ తెర‌కెక్కింది. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై డి. సురేష్‌బాబు నిర్మించిన ఈ చిత్రం సూప‌ర్ హిట్ గా నిలిచింది. అటు స‌మంత‌కు, డైరెక్ట‌ర్ నందినిరెడ్డికి కూడా ఈ మూవీ వల్ల మంచి పేరు వ‌చ్చింది. `ఓ బేబీ` త‌రువాత నందినిరెడ్డి నెట్‌ఫ్లిక్స్ కోసం `ల‌స్ట్ స్టోరీస్‌` వెబ్ సిరీస్ తెలుగు వెర్ష‌న్‌కి డైరెక్ష‌న్ చేస్తున్నారు. ఇటీవ‌లే ఈ […]

  • Ram Naramaneni
  • Publish Date - 1:34 pm, Thu, 16 April 20
నందినిరెడ్డి డైరెక్ష‌న్ లో చైతూ..హీరోయిన్ ఎవ‌రంటే..?

స‌మంత ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన మూవీ `ఓ బేబీ`. కొరియ‌న్ సినిమా `మిస్ గ్రానీ` సోల్ తో ఈ మూవీ తెర‌కెక్కింది. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై డి. సురేష్‌బాబు నిర్మించిన ఈ చిత్రం సూప‌ర్ హిట్ గా నిలిచింది. అటు స‌మంత‌కు, డైరెక్ట‌ర్ నందినిరెడ్డికి కూడా ఈ మూవీ వల్ల మంచి పేరు వ‌చ్చింది. `ఓ బేబీ` త‌రువాత నందినిరెడ్డి నెట్‌ఫ్లిక్స్ కోసం `ల‌స్ట్ స్టోరీస్‌` వెబ్ సిరీస్ తెలుగు వెర్ష‌న్‌కి డైరెక్ష‌న్ చేస్తున్నారు.

ఇటీవ‌లే ఈ వెబ్ సిరీస్ షూటింగ్ కంప్లీట్ అయ్యింది. తాజాగా త‌న నెక్ట్స్ మూవీ స్క్రిప్ట్ పై ఫోక‌స్ పెట్టింది ఈ లేడీ డైరెక్ట‌ర్. ఇందులో నాగ‌చైత‌న్య హీరోగా న‌టించ‌బోతున్నారు. స్వ‌ప్న సినిమా బ్యాన‌ర్‌పై ప్రియాంక ద‌త్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండ‌గా.. స‌మంత హీరోయిన్‌గా చైతూ ప‌క్క‌న హీరోయిన్ గా న‌టించ‌బోతుంద‌నే ప్ర‌చారం జ‌రిగింది. ఈ వార్త‌ల‌పై నందినిరెడ్డి క్లారిటీ వ‌చ్చింది.

`నేను చేయ‌బోతున్న త‌దుప‌రి సినిమా రీమేక్ కాదు. ఒరిజిన‌ల్ క‌థ‌తో చేయ‌బోతున్నాను. స‌మంత‌తో మ‌ళ్లీ క‌ల‌సి చేస్తే హ్యాపీగా అనౌన్స్ చేస్తాను. కానీ ఈ సారి ఇద్ద‌రం వ‌ర్క్ చెయ్య‌డం లేదు అని వెల్ల‌డించింది. ఈ రూమ‌ర్ కి 5కు 1 మాత్ర‌మే రేటింగ్ ఇస్తున్నాను..నెక్ట్స్ టైమ్ బెటర్ గా ట్రై చెయ్యండి అంటూ చుర‌క‌లంటించింది నందినిరెడ్డి.