నా కాపురం నయనతార వల్లే కూలిపోయింది.. ప్రభుదేవ మాజీ భార్య ఫైర్..

ముందు శింబు, ఆ తర్వాత కొరియోగ్రాఫర్, హీరో, డైరెక్టర్‌ ప్రభుదేవాతో ఆమె ప్రేమాయణం నడిపింది. ఇప్పుడు డైరెక్టర్ విఘ్నేష్‌తో ప్రేమలో ఉంది. మరీ ముఖ్యంగా ప్రభుదేవాతో ఈమె నడిపిన ఘాటు ప్రేమాయణంపై అప్పట్లో మీడియాలో..

  • Tv9 Telugu
  • Publish Date - 1:02 pm, Thu, 16 April 20
నా కాపురం నయనతార వల్లే కూలిపోయింది.. ప్రభుదేవ మాజీ భార్య ఫైర్..

ప్రముఖ హీరోయిన్ నయనతార గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. అయితే ఆమె కెరీర్ స్టార్ట్ చేసిన దగ్గర్నుంచీ ఇప్పటివరకూ ఎన్నో వివాదాలు ఆమె చుట్టూ తిరుగుతూనే ఉన్నాయి. అందులో ముఖ్యమైనవి ఆమె లవ్ స్టోరీస్. ముందు శింబు, ఆ తర్వాత కొరియోగ్రాఫర్, హీరో, డైరెక్టర్‌ ప్రభుదేవాతో ఆమె ప్రేమాయణం నడిపింది. ఇప్పుడు డైరెక్టర్ విఘ్నేష్‌తో ప్రేమలో ఉంది. మరీ ముఖ్యంగా ప్రభుదేవాతో ఈమె నడిపిన ఘాటు ప్రేమాయణంపై అప్పట్లో మీడియాలో చాలా వార్తలే వచ్చాయి. నిజానికి ప్రభుదేవాతో పెళ్లి అనుకున్న తర్వాత ఆమె సినిమాలు మానేస్తానని నిర్ణయం కూడా తీసుకుంది నయన్. అనంతరం నయనతార వల్ల ప్రభుదేవ తన భార్య రమాలత్‌కి విడాకులు కూడా ఇచ్చాడు. కానీ చివరి నిమిషంలో ఇద్దరూ విడిపోయారు. ఆ తర్వాత అందరూ ఆ విషయం మర్చిపోయారు.

అయితే ఇప్పుడు మళ్లీ ప్రభుదేవ భార్య రమాలత్‌ మాత్రం ఇప్పటికీ నయనతారపై చిందులు తొక్కుతూనే ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా మరోసారి రమాలత్ నయన్‌పై విరుచుకుపడ్డింది రమాలత్. నయనతార వల్లే తన కాపురం నాశనమయిందని స్నేహితులతో చెప్పుకుని ఏడుస్తుందట. ప్రభుదేవా జీవితంలోకి నయనతార వచ్చిన తర్వాత.. వారి జీవితంలో ఒక్కసారిగా భారీ కుదుపులు మొదలయ్యాయని.. తన బతుకు రోడ్డున పడిందని రమాలత్ మండి పడుతోంది. తన భర్తకు తనను కాకుండా చేసిన నయనతారను దేవుడు శిక్షిస్తాడని.. పెళ్లైన మగాళ్ల వైపు చూసే ఆడవాళ్లను కఠినంగా శిక్షించాలని ఆమె కోరుకుంటోంది.

15 ఏళ్ల పాటు ప్రభుదేవా తనను దేవతలా చూసుకున్నాడని.. ఇల్లు పని తప్ప మరోటి తెలియని తనను.. నయనతార ఏం మాయ చేసిందో అటూ ఆమె వాపోతుంది. మొత్తానికి ప్రభుదేవా భార్య మాటలతో మరోసాని నయన్ ప్రేమాయణం హాట్ టాపిక్ అవుతోంది. నిజానికి ప్రభుదేవా, రమాలత్‌లు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 1995లో వారిద్దరూ ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. రమాలత్ ముస్లిం అమ్మాయి అయినా కూడా ప్రభుదేవా కోసం మతం మార్చుకుంది. ఆ తర్వాత ఇద్దరూ 15 ఏళ్ల పాటూ సంతోషంగా కలిసి ఉన్నారు.

Read More:  పిజ్జా డెలివరీ బాయ్‌కి కరోనా పాజిటివ్

‘రాజముద్ర’ను మార్చేసిన ఏపీ సీఎంవో.. కారణం అదేనా?

వెయ్యి పడకల ఆస్పత్రిని మూసేసిన చైనా

అగ్రరాజ్యాలతో పోటీగా.. కరోనా వాక్సిన్ తయారీలో భారత్ ధీటైన పోటీ