‘కరోనా క్రైసిస్ ఛారిటీ’కి చందమామ విరాళం..!

లాక్‌డౌన్‌ నేపథ్యంలో తెలుగు సినీ కార్మికులను ఆదుకునేందుకు మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో కరోనా క్రైసిస్ ఛారిటీని ప్రారంభించిన విషయం తెలిసిందే.

'కరోనా క్రైసిస్ ఛారిటీ'కి చందమామ విరాళం..!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Apr 16, 2020 | 2:30 PM

లాక్‌డౌన్‌ నేపథ్యంలో తెలుగు సినీ కార్మికులను ఆదుకునేందుకు మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో కరోనా క్రైసిస్ ఛారిటీని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ ఛారిటీకి తెలుగు పరిశ్రమకు చెందిన పలువురు దర్శకులు, నిర్మాతలు, హీరోలు, హీరోయిన్లు తమకు తోచినంత సహాయం చేశారు. ఇక తాజాగా ఈ చారిటీకి విరాళం ఇచ్చారు టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్‌. సీసీసీకి కాజల్ 2 లక్షల రూపాయాలు విరాళంగా ఇచ్చినట్లు ఆమె మేనేజర్ గిరిధర్ వెల్లడించారు. గురువారం నాడు కాజల్ సీసీసీకి విరాళం ఇచ్చినట్లు ఆయన తెలిపారు.

కాగా ఈ ఛారిటీని ప్రారంభించిన తరువాత చాలా మంది ప్రముఖులు విరాళాలు ఇచ్చారు. హీరోయిన్లలో లావణ్య మాత్రమే మొదటగా స్పందించి.. సీసీసీకి విరాళం ఇచ్చింది. మిగిలిన వారెవరు ముందుకు రాకపోగా.. హీరోయిన్లపై నటుడు బ్రహ్మాజీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముంబయి నుంచి వచ్చిన ఎంతో మంది హీరోయిన్లు ఇక్కడ టాప్‌ హీరోయిన్లుగా కొనసాగుతున్నారని.. కానీ ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో వారు ముందుకు రాకపోవడం బాధాకరమని ఆయన మండిపడ్డారు.

మరోవైపు హీరోయిన్లు విరాళాలు ఇవ్వకపోవడంపై చిరంజీవి సైతం స్పందించారు. కార్మికుల కోసం విరాళాలు ఇవ్వాల్సిందిగా హీరోయిన్లకు తాను ఫోన్ చేసి కోరారని.. అందుకు కొంతమంది పాజిటివ్‌గా స్పందించారని చిరు అన్నారు. సీసీసీ కోసం కాజల్, తమన్నా విరాళాలు ఇస్తామని చెప్పారు. మిగిలిన వారిని కూడా నేను కాంటాక్ట్ అవుతున్నా అని మెగాస్టార్ తెలిపారు. మరి కాజల్ కదిలొచ్చింది. ఇప్పటికైనా మిగిలిన హీరోయిన్లు ముందుకొస్తారేమో చూడాలి.

Read This Story Also: ‘కరోనాపై పోరుకు లాక్ డౌన్ పరిష్కారం కాదు.. రాహుల్ గాంధీ

ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
26 రోజులుగా మెగాస్టార్ అదే పని మీద ఉన్నారా.? ఇంటర్వెల్ బాంగ్..
26 రోజులుగా మెగాస్టార్ అదే పని మీద ఉన్నారా.? ఇంటర్వెల్ బాంగ్..