AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నాగార్జున, టబు రిలేషన్‌పై అమల ఏమన్నారంటే..!

టాలీవుడ్‌లో హీరో హీరోయిన్ల రిలేషన్లు ఎప్పటికీ హాట్‌టాపిక్‌గానే ఉంటాయి. ''ఆ హీరో హీరోయిన్‌ రిలేషన్‌లో ఉండేవారు. ఓ హీరో, హీరోయిన్ రిలేషన్‌లో ఉంటున్నారు'' అంటూ ఇప్పటికీ వార్తలు వినిపిస్తూనే ఉంటాయి.

నాగార్జున, టబు రిలేషన్‌పై అమల ఏమన్నారంటే..!
TV9 Telugu Digital Desk
|

Updated on: Apr 16, 2020 | 3:12 PM

Share

టాలీవుడ్‌లో హీరో హీరోయిన్ల రిలేషన్లు ఎప్పటికీ హాట్‌టాపిక్‌గానే ఉంటాయి. ”ఆ హీరో హీరోయిన్‌ రిలేషన్‌లో ఉండేవారు. ఓ హీరో, హీరోయిన్ రిలేషన్‌లో ఉంటున్నారు” అంటూ ఇప్పటికీ వార్తలు వినిపిస్తూనే ఉంటాయి. అలా వచ్చిన వార్తల్లో నాగార్జున, టబు రిలేషన్‌ ఒకటి. వీరిద్దరు పది సంవత్సరాలకు పైగా అఫైర్‌ కొనసాగించారని.. అయితే అమలను వదిలి నాగార్జున రాలేడని తెలుసుకున్న టబు.. నిదానంగా ఆమే దూరంగా వెళ్లిందన్న టాక్‌ అప్పట్లో నడిచింది. అంతేకాదు నాగార్జున ఇంట్లోనే టబు ఉండేదని గాసిప్‌లు వచ్చాయి. ఇక ఈ రూమర్లను వారిద్దరు ఖండించకపోవడంతో అవి నిజమేనని చాలామంది నమ్మేవారు. ఇక ఒకానొక సమయంలో ఈ పుకార్లు ఎక్కువవుతుండగా.. వాటికి చెక్‌ పెట్టేందుకు 2006లో అమల రంగంలోకి దిగారు.

టబు తన స్నేహితురాలని చెప్పిన అమల.. తమ వ్యక్తిగత విషయాల్లో ఎవరు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని గట్టిగా చెప్పారు. ”దేశంలో ఎన్నో సమస్యలు ఉంటే.. అమల ఇంట్లో ఆమె ఫ్రెండ్ ఏం చేస్తుంది అన్న గాసిప్‌లపైనే ఎందుకు ఆసక్తిని చూపుతారో నాకు అర్థం కావడం లేదు. ఇది చాలా బాధను కలిగిస్తోంది. నా ఇంట్లో ఏం జరుగుతున్న దానిపై ఎవరూ అంత బాధపడాల్సిన అవసరం లేదు. హైదరాబాద్‌ ఎప్పుడు వచ్చినా టబు తమ ఇంట్లోనే ఉంటుంది. తన బాధలను మాతో పంచుకుంటుంది. ఇలాంటి వార్తలు ఆమెను చాలా బాధిస్తాయి. అందుకే ఆమెతో మేము ఎప్పుడు ఈ గాసిప్‌ల గురించి మాట్లాడము. తన నాకు మంచి స్నేహితురాలు” అని అమల అప్పట్లో ఓ క్లారిటీని ఇచ్చారు. కాగా దాదాపు 12 ఏళ్ల తరువాత అల వైకుంఠపురములో మూవీ ద్వారా టబు టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.

Read This Story Also: ‘కరోనా క్రైసిస్ ఛారిటీ’కి చందమామ విరాళం..!

Follow Us
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
జూన్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ఇవే..
జూన్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ఇవే..
నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు