AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahesh Babu: కృష్ణుడిగా సూపర్ స్టార్ మహేశ్‌.. మహా భారతంలోని పాత్రలకు సూటయ్యే స్టార్ల వీరే.. వీడియో వేరేలెవల్ అసలు..

పౌరాణికాలకు నాటకీయతను జోడించి సోషియే ఫాంటసీ పేరుతో వచ్చిన సినిమాలు సూపర్ హిట్ అందుకున్నాయి. ఇక ఇప్పటికీ అనేక ఇతిహాసాలు వెండితెరపై ప్రేక్షకులను అలరిస్తున్నాయి.

Mahesh Babu: కృష్ణుడిగా సూపర్ స్టార్ మహేశ్‌.. మహా భారతంలోని పాత్రలకు సూటయ్యే స్టార్ల వీరే.. వీడియో వేరేలెవల్ అసలు..
Actors
Rajitha Chanti
|

Updated on: Nov 22, 2022 | 5:57 PM

Share

ప్రస్తుతం సినీ పరిశ్రమలోని డైరెక్టర్స్ పౌరాణిక సినిమాలు రూపొందించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా ఈ పురాణగాథలను తెరకెక్కించడంలో టాలీవుడ్ ఇండస్ట్రీ ముందుంటుంది. ఎన్టీఆర్.. ఏఎన్నార్ వంటి స్టార్ హీరోస్ ఈ పౌరాణిక పాత్రలతో మెప్పించారు. రామయణం, మహాభారతం. లవకుశ, మాయాబజార్, శ్రీకృష్ణర్జునయుద్ధం, శ్రీకృష్ణతులాభారం వంటి చిత్రాలు ఇప్పటికీ ఆపాత మధురాలుగా నిలిచిపోయాయి. ఇప్పటికీ రాముడు.. కృష్ణుడు అనగానే ఠక్కున తెలుగువారి హృదయాల్లో నిలిచే రూపం ఎన్టీఆర్ దే. ఇక ఆ తర్వాత కాలంలో పౌరాణికాలకు నాటకీయతను జోడించి సోషియే ఫాంటసీ పేరుతో వచ్చిన సినిమాలు సూపర్ హిట్ అందుకున్నాయి. ఇక ఇప్పటికీ అనేక ఇతిహాసాలు వెండితెరపై ప్రేక్షకులను అలరిస్తున్నాయి.

ప్రస్తుతం రామయాణ ఇతిహాసం ఆధారంగా డైరెక్టర్ ఓంరౌత్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు లవర్ బాయ్ గా.. మాస్ హీరోగా కనిపించిన ప్రభాస్.. ఇప్పుడు ఆదిపురుష్ సినిమాతో తొలిసారిగా రాముడిగా కనిపించనున్నారు. ఇక మరోవైపు మహా భారతాన్ని వెండితెరపై ఆవిష్కరించాలని దర్శకధీరుడు రాజమౌళి కలలు కంటున్నారు. ఈ సినిమా తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని ఎన్నోసార్లు జక్కన్న చెప్పుకొచ్చారు. అయితే మహాభారతంలోని కొన్ని పాత్రలకు మన దక్షిణాదిలోని స్టార్స్ ఎవరు ఏ పాత్రకు సూట్ అవుతారో తెలియజేస్తూ.. ఓ నెటిజన్ గ్రాఫిక్ డిజైన్ చేశారు. మహేష్ బాబు, ప్రభాస్, సమంత, నయనతార వంటి స్టార్లను ఒక్కో పాత్రకు డిజైన్ చేసిన వీడియో నెట్టింట వైరలవుతుంది. వీడియో చూసిన నెటిజన్స్ సూపర్.. అద్భుతమంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్న వీడియోలో.. ముందుగా కృష్ణుడిగా మహేష్ లుక్ అదిరిపోయింది. ఆ తర్వాత అర్జునుడిగా సూర్య.. ద్రౌపదిగా హీరోయిన్ ఆసిన్.. విజయ్ దళపతి.. యుధిష్టుడి పాత్రలో.. భీముడిగా ఆర్ మాధవన్.. దుర్యోధనుడి పాత్రలో ప్రభాస్.. కుంతిదేవిగా అనుష్క శెట్టి.. గాంధారి పాత్రలో లేడీ సూపర్ స్టార్ నయనతార, దృతరాష్ట్రుడిగా జయం రవి నటించగా.. కర్ణుడి పాత్రలో విక్రమ్ చియాన్.. భీష్ముడిగా కమల్ హాసన్.. శకునిగా కార్తి.. ద్రోణచార్యుడిగా సూపర్ స్టార్ రజినీకాంత్, సుభద్రగా సమంత సెట్ అవుతున్నట్లు అందంగా సెట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరలవుతుంది. ఆ వీడియోను మీరు ఓసారి చూసేయ్యండి.

View this post on Instagram

A post shared by Asin Suriya (@asin.suriya)

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.