లైవ్‏లో వాట్సప్ నంబర్ అడిగిన నెటిజన్.. మరోసారి తన స్టైల్లో సమాధానం చెప్పిన సింగర్ సునీత..

Singer Sunitha: ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ దేశవ్యాప్తంగా విలయ తాండవం చేస్తోంది. సాయం చేయాలంటూ సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు వేడుకుంటున్నారు.

లైవ్‏లో వాట్సప్ నంబర్ అడిగిన నెటిజన్.. మరోసారి తన స్టైల్లో సమాధానం చెప్పిన సింగర్ సునీత..
Singer Sunitha

Singer Sunitha: ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ దేశవ్యాప్తంగా విలయ తాండవం చేస్తోంది. సాయం చేయాలంటూ సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు వేడుకుంటున్నారు. బెడ్స్, ఆక్సిజన్ సిలిండర్ కావాలని.. అందుబాటులో ఉంటే తెలపాలని వేడుకుంటున్నారు. ఈ క్రమంలో తమ వంతు సాయం చేయడానికి ప్రతి ఒక్కరు ముందుకు వస్తున్నారు. ఇందులో భాగంగా నాకు వీలైనంతగా నేను సాయం చేస్తాను. కరోనా పట్ల ఉన్న భయాలను, ఆందోళనలను దూరం చేస్తాను అటూ అందరితో ముచ్చుట్లు పెడుతూ.. తన గానామృతంతో కొంతసేపైనా ఉపశమనం కలిగిస్తున్నారు సింగర్ సునీత. తన పాటలు వింటుంటే కొంత మందైనా సంతోషంగా ఉంటున్నారంటూ, వారి కోసం ప్రతీ రోజూ ఓ అర్ధగంట సమయం కేటాయిస్తానని సునీత చెప్పుకొచ్చారు. నాకు తెలిసింది పాటలు పాడటమే. అందుకే ఇలా పాడుతూ మీ అందరినీ సంతోషంగా ఉంచేందుకు ప్రయత్నిస్తున్నాను అని సునీత అన్నారు.

ఈ క్రమంలోనే ప్రతి రోజూ రాత్రి ఎనిమిది గంటలకు సునీత లైవ్ లోకి వస్తున్నారు. మొదటి సారిగా శుక్రవారం నాడు రాత్రి ఎనిమిది గంటలకు సునీత లైవ్‌లోకి వచ్చి తన ఫాలోవర్లతో ముచ్చట్లు పెట్టారు. అభిమానులు అడిగిన పాటలను ఆలపిస్తూ వారిని సంతోషపరుస్తున్నారు. ప్రస్తుత కష్ట సమయంలో ఇలా తనను ఎంతో మంది పాటలు అడుగుతున్నారని.. తాను పాడుతూ ఉంటే కాస్త ఉపశమనం కలుగుతుందని భావిస్తే రోజూ ఇలానే ఓ అర్ధగంట లైవ్ పెడతాను అని తెలిపారు. అయితే చెప్పినట్లుగానే సునీత నిన్న రాత్రి 8 గంటలకు లైవ్‌కి వచ్చారు. తన ఫాలోవర్లు పెడుతున్న కామెంట్లను చదివారు. అడిగిన పాటలను పాడేశారు. అయితే ఇందులో ఓ నెటిజన్ మాత్రం సునీతను వాట్సప్ నంబర్ చెప్పమని అడిగేశాడు. దీంతో సునీత సో సారీ అండీ అంటూ నవ్వుతూనే సమాధానం చెప్పారు.

వీడియో..

 

View this post on Instagram

 

A post shared by Sunitha Upadrasta (@upadrastasunitha)

Also Read: Rana Daggupati: శుభం కార్డు వేసిన రానా.. నెంబర్‌ వన్ యారీ సీజన్ 3కి ముగింపు పలికిన భల్లాల దేవా..

Happy Birthday Namitha: హీరోయిన్ నమిత పుట్టిన రోజు నేడు.. ముద్దుగుమ్మ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు..