Krithi Shetty: అక్కినేని అందగాడితో మరోసారి జతకట్టిన బేబమ్మ.. గ్రాండ్‌గా వెల్కమ్ చెప్పిన మూవీ యూనిట్..
Naga Chaitanya: ఉప్పెన సినిమాతో తెలుగు చిత్రసీమలోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చింది కృతిశెట్టి (Krithi Shetty). ఆ సినిమాలో ఆమె పోషించిన బేబమ్మ పాత్ర అందరినీ ఆకట్టుకుంది. ఆ తర్వాత న్యాచురల్ స్టార్‌తో ఆమె చేసిన శ్యామ్ సింగరాయ్ కూడా ..
Naga Chaitanya: ఉప్పెన సినిమాతో తెలుగు చిత్రసీమలోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చింది కృతిశెట్టి (Krithi Shetty). ఆ సినిమాలో ఆమె పోషించిన బేబమ్మ పాత్ర అందరినీ ఆకట్టుకుంది. ఆ తర్వాత న్యాచురల్ స్టార్‌తో ఆమె చేసిన శ్యామ్ సింగరాయ్ కూడా సూపర్‌హిట్‌గా నిలిచింది. ఇక నాగచైతన్య (Naga Chaitanya)తో కలిసి బంగర్రాజులో ఈ బేబమ్మ చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఈ సినిమాలో చైతూ- కృతిల జోడీ చాలా క్యూట్‌గా కనిపించింది. ఇదిలా ఉంటే మరోసారి అక్కినేని అందగాడితో కలిసి స్ర్కీన్ షేర్ చేసుకునే అవకాశం దక్కించుకుంది ముద్దుగుమ్మ. గ్యాంబ్లర్, మానాడు చిత్రాలతో కోలీవుడ్‌లో క్రేజీ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న వెంకట్ ప్రభు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళంలోనూ ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సినిమా షూటింగ్ ఇంకా ప్రారంభం కాకపోయినా.. వరుసగా అప్డేట్స్ ఇచ్చి సర్‌ప్రైజ్ చేసింది చిత్ర బృందం. ఈ సినిమాలో చైతూ సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోన్నట్లు ప్రకటించిన చిత్రబృందం ఈ మేరకు ఓ పోస్టర్ కూడా రిలీజ్ చేసింది. అంతేకాదు, ఈ చిత్రానికి ఇసైజ్ఞాని, మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తున్న విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.
కాగా పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి ఈ మూవీని నిర్మిస్తున్నారు. కాగా ప్రస్తుతం ఇదే సంస్థలో శ్రీనివాసా చిట్టూరి ఎనర్జిటిక్ స్టార్ రామ్‌తో రెండు సినిమాలు చేస్తున్నారు. అందులో ఒకటి ది వారియర్. ఇందులోనూ కృతినే హీరోయిన్‌గా నటిస్తోంది. మరో చిత్రం రామ్- బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కనుంది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభమైంది. కాగా ఇదే నిర్మాణ సంస్థలో కృతి శెట్టి రెండవ సినిమాకు ఎంపికవడం విశేషం. ప్రస్తుతం ఆమె చేతిలో భారీ సినిమాలు ఉన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ తాము నిర్మిస్తున్న ఈ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమాలో కృతీశెట్టినే హీరోయిన్ గా తీసుకుంది. సుధీర్ బాబు ఈ సినిమాలో హీరో కాగా ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకుడు. దీంతో పాటు నితిన్ సరసన మాచర్ల నియోజకవర్గం సినిమాలోనూ కృతినే మెయిన్ లీడ్లో నటిస్తోంది.
Welcome aboard The most happening @IamKrithiShetty
Next Announcement Will Enthrall You Today at 11:08 AM ?#NC22Begins ❤️?#NC22 @chay_akkineni @srinivasaaoffl @SS_Screens pic.twitter.com/2tp5rZgIm4
— venkat prabhu (@vp_offl) June 23, 2022
A dream come true moment for me!! Joining hands with my uncle (periyappa) #isaignani @ilaiyaraaja for the first time along with my brother @thisisysr for #NC22 #VP11 pic.twitter.com/OVzZS03T8B
— venkat prabhu (@vp_offl) June 23, 2022
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..