Ram Pothineni: ఆ స్టార్ డైరెక్టర్‌కు రామ్ పోతినేని క్షమాపణలు.. ట్వీట్ చేసిన ఎనర్జిటిక్ స్టార్.. ఎందుకంటే ?
ప్రస్తుతం ఈ యంగ్ హీరో డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో ది వారియర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో రామ్ సరసన కృతి శెట్టి కథానాయికగా
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని (Ram Pothineni) తమిళ్ డైరెక్టర్ లింగుస్వామికి ట్విట్టర్ వేదికగా క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు సారీ..లవ్ యూ అంటూ తన ట్విట్టర్ ఖాతాలో రాసుకొచ్చారు.. ప్రస్తుతం ఈ యంగ్ హీరో డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో ది వారియర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో రామ్ సరసన కృతి శెట్టి కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ ఈ మూవీపై మరింత అంచనాలను పెంచేశాయి. ఈ సినిమాలో రామ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనించనున్నాడు. సత్య ఐపీఎస్ పాత్రలో రామ్ పోతినేని, విజిల్ మహాలక్ష్మిగా కృతి శెట్టి.. ఇద్దరూ ఆకట్టుకోనున్నారు. తెలుగు, తమిళ్ భాషలలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి అయ్యింది..ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా జూలై 14 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో బుధవారం ఈ మూవీ నుంచి మరో విజిల్ సాంగ్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్.. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా విజిల్ పాట విడుదల కోసం హైదరాబాద్ లో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
ఈ వేడుకలో చిత్రయూనిట్ పాల్గోని.. షూటింగ్ సమయంలో జరిగిన సంఘటనలను గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా రామ్ మాట్లాడుతూ.. విజిల్ సాంగ్ తనకు చాలా నచ్చిందని.. తమ చిత్రానికి ఇంతటి ఎనర్టిటిక్ మ్యూజిక్ అందించిన దేవీ శ్రీ ప్రసాద్, సింగర్స్, ప్రొడ్యూసర్స్.. ఇతర చిత్రయూనిట్ సభ్యులకు ధన్యవాదాలు చెప్పారు. అయితే రామ్ స్పీజ్ ఇస్తున్న సమయంలో డైరెక్టర్ లింగుస్వామి గురించి చెప్పడం మర్చిపోయారు.. ఇక ఈ విషయాన్ని గ్రహించిన రామ్ ట్విట్టర్ వేదికగా దర్శకుడికి క్షమాపణలు చెప్పారు.. ఈ సినిమా తెరకెక్కడంలో ముఖ్య పాత్ర పోషించిన వ్యక్తి గురించి చెప్పడం మర్చిపోయాను.. నా వారియర్, డైరెక్టర్ లింగుస్వామి… ఈ సినిమాకు సంబంధించిన ప్రతి ఫ్రేమ్ ను మీరు మీ భుజాలపై ఎత్తుకున్నారు. ఇప్పటివరకు నేను చేసిన ఉత్తమ దర్శకులలో మీరు ఒకరిగా ఉన్నందుకు ధన్యవాదాలు.. సారీ అండ్ లవ్ యూ అంటూ రాసుకొచ్చారు. ఇక రామ్ చేసిన ట్వీట్ పై డైరెక్టర్ లింగుస్వామి స్పందించారు..
నాతో కలిసి పనిచేయడానికి నువ్వు ఎంతగా ఇష్టపడ్డావో నాకు తెలుసు.. సినిమా చూసిన తర్వాత ఆత్మీయంగా నువ్వు నన్ను ఆలింగనం చేసుకున్నావ్.. ఆ క్షణాన్ని నేను ఎప్పటికీ మర్చిపోను.. మనం మరింత దూరం ప్రయాణించాలనుకుంటున్నాను.. అంటూ రిప్లై ఇచ్చారు.. ప్రస్తుతం వీరిద్దరి ట్వీట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై ప్రొడక్షన్ నెం. 6గా శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న ఈ మూవీ చిత్రీకరణ పూర్తయింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలో నదియా .. అక్షరగౌడ .. భారతీరాజా ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. జులై 14న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
Sir I know how much you loved working me, the hug you gave me after watching the film is & will always be in my heart. Those claps & whistles are what we look forward to & I knew there is long travel between us moving forward. https://t.co/u1JXW5HHxI
— Lingusamy (@dirlingusamy) June 22, 2022
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.