Tollwood: టాలీవుడ్లో ముదిరిన వివాదం.. తెలుగు చిత్ర పరిశ్రమలో నిలిచిన షూటింగ్స్..
తెలుగు సినీ కార్మికులు గురువారం నుంచి షూటింగ్స్‌లలో పాల్గొనాలని కోరుతున్నారు తెలుగు ఫిలిం ఛాంబల్ సభ్యులు.. నిర్మాతలు ఎవ్వరూ కార్మిక సంఘాల ఒత్తిళ్లకు గురి కావొద్దు అని కోరింది తెలుగు ఫిలిం ఛాంబర్.
ఫిల్మ్ చాంబర్ – ఫెడరేషన్ మధ్య వివాదం ముదురుతోంది. తమకు వేతనాలు పంచేవరకు షూటింగ్స్‌కు హాజరుకాబోమని బుధవారం సినీ కార్మికులు సమ్మె చేపట్టిన సంగతి తెలిసిందే. తాము వేతనాలు పెంచేందుకు సిద్దంగా ఉన్నామని..ఆకస్మికంగా ఇలా సమ్మె చేపట్టడం సరైనది కాదంటూన్నారు తెలుగు చిత్ర నిర్మాతలు.. ఈ క్రమంలోనే ఇరువర్గాలు ఎవరికి వారే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో భేటీ అయ్యారు. తమ సమస్యలు, ఇబ్బందులను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. భేటీ అనంతరం బయటికొచ్చిన నిర్మాతలు, కార్మిక సంఘాల నాయకులు భిన్న వాదనలు వినిపించారు. షూటింగ్‌లు నిలిచిపోయాయని నిర్మాతలు ప్రకటిస్తే.. అదేం లేదని కొట్టిపడేశారు సినీ కార్మిక సమాఖ్య నేతలు. కార్మికులు వచ్చేంత వరకు షూటింగ్‌లకు నిరవధికంగా వాయిదా వేస్తామన్నారు నిర్మాత సి.కల్యాణ్.
తెలుగు సినీ కార్మికులు గురువారం నుంచి షూటింగ్స్‌లలో పాల్గొనాలని కోరుతున్నారు తెలుగు ఫిలిం ఛాంబల్ సభ్యులు.. నిర్మాతలు ఎవ్వరూ కార్మిక సంఘాల ఒత్తిళ్లకు గురి కావొద్దు అని కోరింది తెలుగు ఫిలిం ఛాంబర్. ఇక గురువారం కూడా సినీ కార్మీకులెవరూ షూటింగులలో పాల్గొనలేదు.. దీంతో తెలుగు చిత్ర వాణిజ్య మండలికి…తెలుగు ఫిలిం ఫెడరేషన్ కు మధ్య వివాదం మరింత ముదిరినట్టుగా తెలుస్తోంది. వేతనాలు పెంచేంత వరకు షూటింగ్‌లకు హాజరుకాము అంటున్నారు ఫెడరేషన్ సభ్యులు. అయితే కార్మికులు మొండివైఖరి అవలంబిస్తే సినిమా నిర్మాణం ఆపడానికి సిద్ధమంటున్నారు నిర్మాతలు.. 45 శాతం కంటే ఎక్కువ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నారు ఫెడరేషన్ సభ్యులు. సినీ కార్మికులకు, నిర్మాతలకు మధ్య నెలకొన్న వివాదాన్ని పరిష్కరించేందుకు సినిమాటోగ్రఫి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చర్చలు జరుపుతున్నారు. త్వరలోనే ఈ వివాదంపై ఓ స్పష్టత రానున్నట్లుగా తెలుస్తోంది.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.