The Warriorr: యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న విజిల్ సాంగ్.. విజిలెయ్ పాటకు రెస్పాన్స్ అదిరిపోయిందిగా..

ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ ఈ మూవీపై మరింత అంచనాలను పెంచేశాయి. ఈ సినిమాలో రామ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనించనున్నాడు. సత్య ఐపీఎస్ పాత్రలో రామ్ పోతినేని, విజిల్ మహాలక్ష్మిగా కృతి శెట్టి.. ఇద్దరూ ఆకట్టుకోనున్నారు. తె

The Warriorr: యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న విజిల్ సాంగ్.. విజిలెయ్ పాటకు రెస్పాన్స్ అదిరిపోయిందిగా..
Whistle Song
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 23, 2022 | 10:48 AM

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని… ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి జంటగా నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం ది వారియర్ (The Warriorr).. ఈ సినిమాకు తమిళ్ స్టార్ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ ఈ మూవీపై మరింత అంచనాలను పెంచేశాయి. ఈ సినిమాలో రామ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనించనున్నాడు. సత్య ఐపీఎస్ పాత్రలో రామ్ పోతినేని, విజిల్ మహాలక్ష్మిగా కృతి శెట్టి.. ఇద్దరూ ఆకట్టుకోనున్నారు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతోంది ఈ మూవీ. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వ‌ర్ స్క్రీన్ పతాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం. 6గా శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న ఈ మూవీ చిత్రీకరణ పూర్తయింది. ఇక ఇప్పటికే ఈ మూవీనుంచి వచ్చిన బుల్లెట్ సాంగ్ ఏ రేంజ్ లో ఆకట్టుకుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా ఈ సినిమా నుంచి విజిల్ సాంగ్ రిలీజ్ చేశారు..

తమిళ్ స్టార్ సూర్య సోషల్ మీడియా ద్వారా విజిల్ సాంగ్ రిలీజ్ చేశారు.. విజిలు.. విజిలు.. విజిలెయ్ అంటూ సాగే ఈ పాటలో రామ్, కృతి శెట్టి అభినయం.. స్టెప్స్ ఆకట్టుకుంటున్నాయి. సాహితి సాహిత్యం అందించగా.. ఆంథోని దాసన్, శిరీషా జయశీలన్ ఆలపించిన ఈ పాటకు ప్రేక్షకుల నుంచి అనుహ్యమైన స్పందన వస్తోంది.. ఈ సాంగ్ ఇప్పుడు యూట్యూబ్‏ను షేక్ చేస్తుంది.. బుధవారం విడుదలైన ఈ పాట ఇప్పటివరకు 2.5 మిలియన్ వ్యూస్‏తో దూసుకుపోతుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలో నదియా .. అక్షరగౌడ .. భారతీరాజా ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. జులై 14న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.