AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Toxic Movie: ఏ సినిమా ప్రమోషన్లకు రాని నయనతార ‘టాక్సిక్’ ఈవెంట్‌కు ఎందుకు వచ్చిందో తెలుసా? అసలు విషయమిదే

సాధారణంగా ఏ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలకు హాజరు కాదు లేడీ సూపర్ స్టార్ నయనతార. అలాగే ఆమె ఎవరినీ అనవసరంగా పొగడదు. కానీ శనివారం (ఆగస్టు 08) జరిగిన 'టాక్సిక్' ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ లో నయనతార స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. అంతేకాదు డైరెక్టర్ గీతూ మోహన్‌దాస్‌, హీరో యశ్ లపై ప్రశంసలు కురిపించింది.

Toxic Movie: ఏ సినిమా ప్రమోషన్లకు రాని నయనతార 'టాక్సిక్' ఈవెంట్‌కు ఎందుకు వచ్చిందో తెలుసా? అసలు విషయమిదే
Nayanthara In Toxic Movie
Basha Shek
|

Updated on: Aug 09, 2026 | 1:29 PM

Share

దక్షిణాది లేడీ సూపర్ స్టార్ నయనతార క్రేజ్, పాపులారిటీ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం ఇండియాలో బాగా డిమాండ్ ఉన్న టాప్ మోస్ట్ హీరోయిన్లలో ఆమె కూడా ఒకరు. అయితే సినిమాలకు సంబంధించి నయనతారకు కొన్ని రూల్స్, కండిషన్స్ ఉంటాయి. అదేంటంటే.. నయనతార ఏ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలకు హాజరుకాదు. ఎంత పెద్ద స్టార్ సినిమా అయినా ఇంటర్వ్యూలు ఇవ్వదు. అలాగే వేదికలపై గొప్పలు చెప్పుకోదు. ఎవరినీ అనవసరంగా పొగడదు. కానీ శనివారం (ఆగస్టు 08) ‘టాక్సిక్’ ట్రైలర్ విడుదల కార్యక్రమానికి నయనతార హాజరయ్యారు. అంతేకాదు తన లుక్స్, డ్రెస్సింగ్ తో సెంటరాప్‌ అట్రాక్షన్ గా నిలిచారు. ఈ సందర్భంగా మాట్లాడిన నయన్.. హీరో యశ్, దర్శకురాలు గీతూ మోహన్‌దాస్‌పై ప్రశంసలు కురిపించారు. ఇదే క్రమంలో సినిమా ఈవెంట్లకు తాను హాజరుకాకపోవడానికి, టాక్సిక్ ఈవెంట్ కు రావడానికి గల కారణాలను స్వయంగా ఆమెనే అందరితో పంచుకున్నారు.

‘సాధారణంగా నేను సినిమా ప్రమోషనల్ ఈవెంట్లకు వెళ్లను. ఎందుకంటే నాకు సరిగా మాట్లాడం రాదు. ప్రమోట్ చేయడం, ప్రసంగాలు ఇవ్వడం నాకు కొంచెం కష్టంగా ఉంటుంది. కానీ నేను ఇక్కడికి కేవలం యష్ కోసమే వచ్చాను. నాకు స్వయంగా ఫోన్ చేసి రమ్మని యష్ చెప్పాడు, అందుకే వచ్చాను. నేను చాలా మంది స్టార్ నటులతో పనిచేశాను. కానీ యష్ అందరికంటే భిన్నమైనవాడు. తెరపై కనిపించే దానికంటే అతను చాలా గొప్పవాడు. అతనిలా కష్టపడే వారిని నేను ఎప్పుడూ చూడలేదు. అతను నిజంగా ఒక పని రాక్షసుడు’ అని నయన్ చెప్పుకొచ్చింది.

ఇక డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ గురించి గురించి పలు ఆసక్తికర కామెంట్స్ చేశారు నయనతార.. ‘ నేను, గీతూ మోహన్‌దాస్ కలిసి 20 ఏళ్ల క్రితం ఒక సినిమాలో నటించాం. అప్పటి గీతూకి, ఇప్పటి గీతూకి చాలా తేడా ఉంది. నేను ఎక్కువ మంది నటీనటులున్న సినిమాలను ఒప్పుకోను. అలాంటి సినిమాల్లో నటించడానికి నేను కొంచెం సంకోచిస్తాను. అందుకే గీతూ మొదట నాకు ఫోన్ చేసినప్పుడు, నేను నటించనని చెప్పాను. కానీ గీతూ నన్ను కోటి ప్రశ్నలు అడిగింది. నేను సరే, రా కథ చెప్పు అన్నాను. ఆమె కథ చెప్పినప్పుడు, నేను ఆశ్చర్యపోయాను. ఈమె ఎవరు? మేమిద్దరం ఎప్పుడూ కలుసుకోనట్లు అనిపించింది. నేను వెంటనే ఆ సినిమాను ఒప్పుకున్నాను. గీత టేకింగ్ అసాధారణమైనది. మీరు ట్రైలర్ చూశారు కదా, అది అద్భుతంగా ఉంది. కానీ సినిమా ఇంతకంటే చాలా పెద్దది. ఇది సాధారణ సినిమా కాదు. గీతు దర్శకురాలిగా అద్భుతం, కానీ ఒక మహిళగా ఆమె ఇంకా అద్భుతం. నేను గీతు గురించి ఎంతసేపైనా మాట్లాడగలను’ అని నయనతార అన్నారు.

ఇవి కూడా చదవండి

టాక్సిక్ ట్రైలర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us