రెండు పెళ్లిళ్లు.. విడాకులు.. భర్తకు భరణం ఇచ్చిన ఏకైక హీరోయిన్..
Rajitha Chanti
Pic credit - Instagram
08 August 2026
ఇటీవల కాలంలో విడాకుల కేసులు, భరణం చెల్లింపులు సినీ పరిశ్రమలో నిత్యం వార్తల్లో నిలుస్తుంటాయి. ముఖ్యంగా సినీతారలకు సంబంధించిన విషయాలు వైరలవుతున్నాయి.
సాధారణంగా విడాకుల సమయంలో భార్యకు భర్త భారీ మొత్తంలో భరణం చెల్లించడం చూస్తుంటాం. కానీ బాలీవుడ్, బుల్లితెర నటి శ్వేతా తివారీ విషయంలో మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా జరిగింది.
విడాకుల సెటిల్‌మెంట్‌లో భాగంగా ఆమె తన మాజీ భర్త రాజా చౌదరికే రివర్స్‌లో భరణం చెల్లించి అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమయ్యారు. ఇంతకీ అసలు విషయం ఏంటో తెలుసుకుందామా.
శ్వేతా తివారీ 1998లో తన 18 ఏళ్ల వయసులోనే రాజా చౌదరిని వివాహం చేసుకున్నారు. బుల్లితెరపై స్టార్ కపుల్‌గా గుర్తింపు పొందిన ఈ దంపతులకు 'పాలక్ తివారీ' అనే కుమార్తె జన్మించింది.
అయితే కొన్నాళ్లకు వీరి మధ్య మనస్పర్ధలు రావడం, గృహ హింస తదితర కారణాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న శ్వేత, 2007లో విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు.
విడాకుల ప్రక్రియలో శ్వేతా తివారీ తన భర్త నుంచి ఎలాంటి భరణాన్ని డిమాండ్ చేయలేదు. పైగా తన కుమార్తె పాలక్ కస్టడీ పూర్తిగా తనకు దక్కాలనే పట్టుదలతో ఉన్నారు.
ఆ సమయంలో సుమారు రూ. 93 లక్షల విలువైన ఫ్లాట్‌పై కుమార్తెతో కలిపి ఉమ్మడి యాజమాన్య ప్రతిపాదనను శ్వేత తీసుకువచ్చినప్పటికీ, రాజా చౌదరి దానికి అంగీకరించలేదు.
దీంతో తన కూతురి భవిష్యత్తే అత్యంత ముఖ్యమని భావించిన శ్వేత, ఎలాంటి సందేహం లేకుండా ఆ ఫ్లాట్‌ను పూర్తిగా రాజా చౌదరి పేరు మీదికే రాసిచ్చేశారు. కుమార్తె కస్టడీ కోసం భర్తకే భరణం ఇచ్చింది.