AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kangana Ranaut: కంగనా చేతిలోని ఈ రంగురంగుల గొడుగు ప్రత్యేకత ఏంటో తెలుసా? ధర చూస్తే ఆశ్చర్యపోతారు

సినిమాలు చేసినా చేయకపోయినా తరచూ వార్తల్లో నిలుస్తున్నారు కంగనా రనౌత్. ప్రస్తుతం పార్లమెంట్ సభ్యురాలిగా సేవలందిస్తోన్న ఆమె ఆ మధ్యన జెన్-z పై కామెంట్స్ తో నెట్టింట బాగా ట్రెండ్ అయ్యారు. తాజాగా తన స్టైలిష్ లుక్, డ్రస్సింగ్ తో మరోసారి అందరి దృష్టిని ఆకర్షించారు కంగనా.

Kangana Ranaut: కంగనా చేతిలోని ఈ రంగురంగుల గొడుగు ప్రత్యేకత ఏంటో తెలుసా? ధర చూస్తే ఆశ్చర్యపోతారు
Kangana Ranaut
Basha Shek
|

Updated on: Aug 09, 2026 | 1:00 PM

Share

గతంలో కంటే బాగా సినిమాలు తగ్గించారు బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ హీరోయిన్ కంగనా రనౌత్. చివరిగా ఆమె ‘భారత భాగ్య విధాత’ అనే సినిమాలో నటించారు. 26/11 టెర్రరిస్ట్ దాడుల నేపథ్యంతో తెరకెక్కించిన ఈ చిత్రం పెద్దగా ఆడలేదు. స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా త్వరలోనే ఈ సినిమా ఓటీటీలోకి కూడా వస్తోంది. సినిమాల సంగతి పక్కన పెడితే ప్రస్తుతం కంగనా లోక్ సభ ఎంపీగా సేవలందిస్తున్నారు. భారతీయ జనతా పార్టీలో కొనసాగుతోన్న ఆమె హిమాచల్ ప్రదేశ్‌లోని మండీ నుంచి గెలుపొంది పార్లమెంట్ లోకి అడుగు పెట్టారు. ఎప్పుడూ కాంట్రవర్సీ కామెంట్స్ తో తరచూ వార్తల్లో నిలిచే కంగనా ఇప్పుడు తన స్టైలిష్‌ లుక్‌తో నెట్టింట వైరల్ అవుతున్నారు. వివరాల్లోకి వెళితే.. తాజాగా పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యారు కంగనా. చక్కని చేనేత చీర , ఖరీదైన డిజైనర్ బ్యాగుతో పార్లమెంట్ కు వచ్చారామె. అయితే ఈసారి ఆమె చీర, హ్యాండ్ బ్యాగ్ కంటే చేతిలో పట్టుకున్న గొడుగే బాగా హైలెట్ గా నిలిచింది. ‌సాధారణ నలుపు రంగు గొడుగులకు భిన్నంగా రంగురంగుల ప్రింటెడ్‌ గొడుగుతో కనిపించారీ బీజేపీ ఎంపీ. ఈ గొడుగు పట్టుకుని పార్లమెంట్ లో కంగనా తిరుగుతున్న ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరలవుతున్నాయి. దీంతో ఈ గొడుగు ప్రత్యేకతలు, ధర తదితర విషయాలపై నెటిజన్లు ఆరా తీస్తున్నారు.

కంగనా చేతిలో ఉన్న ఈ ఆక్వా కలర్‌ గొడుగును ప్రముఖ లగ్జరీ డిజైన్‌ హౌస్‌ గుడ్‌ ఎర్త్‌ రూపొందించిందట. ప్రస్తుతం మార్కెట్ లో దీని ధర సుమారు రూ.6,100 అని తెలుస్తోంది. మొత్తానికి వర్షాలు, విపరీతమైన ఎండల నుంచి రక్షణ కోసం ఉపయోగించే గొడుగును కూడా ఫ్యాషన్‌ స్టేట్‌మెంట్‌గా మార్చేశారు కంగనా. చీర, బ్యాగ్‌తో పాటు ఈ రంగురంగుల గొడుగు ఆమె లుక్‌కు మరింత ప్రత్యేకతను తీసుకొచ్చిందని చెప్పవచ్చు.

ఇవి కూడా చదవండి

పార్లమెంట్ లో కంగనా రనౌత్..

ఇక సినిమాల విషయానికి వస్తే.. కంగనా ప్రధాన పాత్రలో నటించిన భారత భాగ్య విధాత సినిమా త్వరలోనే ఓటీటీలోకి వస్తోంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 సొంతం చేసుకుంది. స్వాతంత్ర్య దినోత్సవం కానుకాగా ఆగస్టు 14 నుంచి ఈ రియల్ స్టోరీ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ ఫామ్ పై సందడి చేయనుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
స్థిరంగా బంగారం ధరలు.. అక్టోబర్ 11న తులం ఎంతంటే..?
స్థిరంగా బంగారం ధరలు.. అక్టోబర్ 11న తులం ఎంతంటే..?
సౌదీలో ఎయిర్‌పోర్టుపై దాడి.. 12 మంది మృతి.. 309 మందికి గాయాలు!
సౌదీలో ఎయిర్‌పోర్టుపై దాడి.. 12 మంది మృతి.. 309 మందికి గాయాలు!
పప్పు నానబెట్టకుండా అప్పటికప్పుడు చేసుకునే పెసరపప్పు వడలు..
పప్పు నానబెట్టకుండా అప్పటికప్పుడు చేసుకునే పెసరపప్పు వడలు..
అదిరిపోయే ప్లగ్‌-ఇన్ హైబ్రిడ్ SUV వచ్చేస్తోంది
అదిరిపోయే ప్లగ్‌-ఇన్ హైబ్రిడ్ SUV వచ్చేస్తోంది
APPSC నుంచి 97 హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
APPSC నుంచి 97 హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
ఒక్క రాత్రిలో కంటిచూపును అమాంతం పెంచే అద్భుతమైన పాతకాలపు చిట్కా
ఒక్క రాత్రిలో కంటిచూపును అమాంతం పెంచే అద్భుతమైన పాతకాలపు చిట్కా
ప్రెజర్ కుక్కర్‌లో అన్నం మరీ మెత్తగా అవుతోందా..? ఇలా చేయండి..!
ప్రెజర్ కుక్కర్‌లో అన్నం మరీ మెత్తగా అవుతోందా..? ఇలా చేయండి..!
అక్టోబర్ 11 దినఫలాలు: ఆ రాశి నిరుద్యోగులకు గుడ్ న్యూస్..
అక్టోబర్ 11 దినఫలాలు: ఆ రాశి నిరుద్యోగులకు గుడ్ న్యూస్..
సతీదేవి నుంచి శైలపుత్రిగా పార్వతి.. నవదుర్గల తొలి రూపం వెనుక..
సతీదేవి నుంచి శైలపుత్రిగా పార్వతి.. నవదుర్గల తొలి రూపం వెనుక..
అమెరికాలో కాల్పులు.. ఇద్దరు పిల్లలు, గర్భిణీ సహా 9 మంది మృతి!
అమెరికాలో కాల్పులు.. ఇద్దరు పిల్లలు, గర్భిణీ సహా 9 మంది మృతి!