AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: దిమాక్ కరాబ్.. 8 ఏళ్ల పిల్లాడు చెప్పిన కథలు.. విని పోలీసులే షాక్..! చివర్లో ట్విస్ట్ ఉంటుంది భయ్యా..!!

ఎప్పటిలాగే ఈ వీకెండ్ లో కూడా పలు కొత్త సినిమాలు ఓటీటీలోకి వచ్చేశాయి. అలాగే ఆసక్తికర వెబ్ సిరీస్ లు కూడా డిజిటల్ స్ట్రీమింగ్ లో సందడి చేస్తున్నాయి. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడం, మలయాళం తదితర భాషలకు చెందిన సినిమాలు, వెబ్ సిరీస్ లు కూడా వివిధ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో స్ట్రీమింగ్ అవుతున్నాయి.

OTT Movie: దిమాక్ కరాబ్.. 8 ఏళ్ల పిల్లాడు చెప్పిన కథలు.. విని పోలీసులే షాక్..! చివర్లో ట్విస్ట్ ఉంటుంది భయ్యా..!!
Ott Movie
Rajeev Rayala
|

Updated on: Aug 09, 2026 | 12:08 PM

Share

ఓటీటీలో ఎన్నో రకాల క్రేజీ సినిమాలు ఉన్నాయి. థియేటర్స్ కు మించి ఎంటర్టైన్ అందించడానికి ప్రతి వారం పదుల సంఖ్యలో సినిమాలు విడుదలై ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. హారర్, థ్రిల్లర్ సినిమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఓటీటీల పుణ్యమా అని ఆడియన్స్ డబుల్ ఎంటర్టైన్ అవుతున్నారు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలు థియేటర్స్ లో విడుదలవుతూనే ఓటీటీలోనూ మెప్పిస్తున్నాయి. నెల రోజులకే ఓటీటీలోకి వచ్చి సందడి చేస్తున్నాయి. ఇక ఇప్పుడు ఓ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా ఓటీటీను ఊపేస్తోంది. ఈ సినిమాలో ఊహించని ట్వీట్స్ లు, సస్పెన్స్ లు, ఊహించని సన్నివేశాలు ప్రేక్షకులను సీట్ ఎడ్జ్ లో కూర్చోబెడతాయి. థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారికి ఈ సినిమా బెస్ట్ మూవీ. ఒక్కసారి చూడటం మొదలు పెడితే అస్సలు ఆపలేరు. ఆ సినిమా మరేదో కాదు. 2021లో వచ్చిన మలయాళం మూవీ నిళల్.

నిళల్ కథ విషయానికొస్తే.. జాన్ బేబీ (కుంచాకో బోబన్) ఒక ఫస్ట్ క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్. ఒక ప్రమాదం తర్వాత అతను మానసికంగా కొంత ఇబ్బంది పడుతుంటాడు. ఆ సమయంలో 8 ఏళ్ల నితిన్ అనే చిన్న పిల్లాడిని కలుస్తాడు. నితిన్‌కు హత్యల కథలు చెప్పడం అంటే చాలా ఆసక్తి. కానీ అవి సాధారణంగా పిల్లలు ఊహించి చెప్పే కథల్లా ఉండవు. జాన్ బేబీ ఆ కథల్లో చెప్పిన సంఘటనలను పరిశీలించగా, వాటిలోని వివరాలు నిజ జీవితంలో జరిగిన హత్యలు,సంఘటనలతో ఆశ్చర్యకరంగా సరిపోతున్నట్లు తెలుస్తుంది.

దీంతో జాన్ బేబీకి పెద్ద ప్రశ్న ఎదురవుతుంది, నితిన్‌కు ఈ హత్యల గురించి ఎలా తెలుసు.? అతను ఊహించి చెబుతున్నాడా? లేక అతని కథలకు నిజమైన సంబంధం ఉందా.? అనేది ఆసక్తిని పెంచుతుంది. ఇక్కడి నుంచి సినిమా నితిన్ గతం, అతని తల్లి శర్మిల (నయనతార) పాత్ర, అలాగే జాన్ బేబీ ఎదుర్కొంటున్న మానసిక పరిస్థితి చుట్టూ మిస్టరీని పెంచుతుంది. జాన్ బేబీ తన మానసిక సమస్యలతో పోరాడుతూనే ఈ కేసును ఛేదించే ప్రయత్నం చేస్తాడు. ఈ సినిమా ఊహించని ట్విస్ట్ లతో సాగుతుంది. ఈ సినిమా తెలుగులోనూ అందుబాటులో ఉంది. ప్రస్తుతం ఈ తెలుగు వెర్షన్ ఆహాలో అందుబాటులో ఉంది. ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us