AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

DMart Shopping Tips: డీమార్ట్‌లో ఏ రోజుల్లో ఆఫర్లు ఎక్కువ ఉంటాయంటే..? ఇది తెలుసుకుంటే బిల్లు సగానికి సగం తగ్గుతుంది..

డీమార్ట్ అంటే తెలియనివారు ఎవరూ ఉండదరు. ఇంట్లోకి అవసరమయ్యే ప్రతీ వస్తువు ఇక్కడ లభిస్తుంది. కిరాణా సరుకుల నుంచి దుస్తుల వరకు ప్రతీఒక్కటి లభిస్తుంది. షాపింగ్‌కు వన్ స్టాప్ డెస్టినేషన్‌గా చెప్పవచ్చు. కిరాణా షాపుల్లో అన్నీ వస్తువులు దొరకవు. అదే డీమార్ట్‌లో అన్నీ ఒకేచోట లభిస్తాయి.

DMart Shopping Tips: డీమార్ట్‌లో ఏ రోజుల్లో ఆఫర్లు ఎక్కువ ఉంటాయంటే..? ఇది తెలుసుకుంటే బిల్లు సగానికి సగం తగ్గుతుంది..
Dmart
Venkatrao Lella
|

Updated on: Aug 09, 2026 | 1:05 PM

Share

ఇంట్లోకి నిత్యావసర సరుకులు లేదా ఇతర ఏవైనా వస్తువులు అవసరమైతే ముందుగా అందరికీ డీమార్ట్‌ను గుర్తుకొస్తుంది. సామాన్యుల షాపింగ్‌కు ఇది కేరాఫ్ అడ్రస్‌గా చెప్పవచ్చు. తక్కువ ధరలతో పాటు ఆఫర్లు, డిస్కౌంట్స్ వల్ల డీమార్ట్‌కు వెళ్లేందుకు సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. దీంతో ఎప్పుడూ ఇక్కడ జనం కిటకిటలాడుతూ ఉంటారు. శనివారం, ఆదివారం, సెలవు రోజుల్లో వెళితే కనీసం కాలు పెట్టడానికి కూడా ఖాళీ ఉండనంత జనంతో కిక్కిరిసి ఉంటుంది. అయితే డీమార్ట్ ఆఫర్లతో ఎక్కువ పాపులర్ అయింది. ఎప్పుడూ ఏవోక ఆఫర్లు ఉంటూనే ఉంటాయి. ఆఫర్లు ఎప్పుడు ఒకేలా ఉండవు. ఏ రోజుకు ఆ రోజు మారుతూనే ఉంటాయి.

డీమార్ట్‌లో ఏ రోజు ఆఫర్లు ఎక్కువ ఉంటాయి..?

డీమార్ట్‌లో షాపింగ్ చేసేందుకు ఆదివారం ఎక్కువమంది జనం వస్తారు. దీంతో ఆ రోజు సేల్స్ ఎక్కువగా జరుగుతాయి. ఆ తర్వాత రోజు సోమవారం అదనపు ఆఫర్లు అందుబాటులో ఉండే అవకాశం ఉంటుంది. సోమవారం వెళితే అదనపు ఆఫర్లతో ఎక్కువ ప్రయోజనం పొందవచ్చు. అయితే ప్రాంతాన్ని, రాష్ట్రాన్ని, స్టోర్‌ను బట్టి ఆఫర్లు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. అన్ని స్టోర్లలో ఆఫర్లు ఒకేలా ఉండవు. దీంతో కస్టమర్లు దీనిని గమనించాల్సి ఉంటుంది. మార్ట్‌కు వెళ్లాలనుకున్నప్పుడు డీమార్ట్ రెడీ యాప్ ఒకసారి ఇన్‌స్టాల్ చేసుకుని అందులోని ధరలను పరిశీలించండి. కొన్నిసార్లు స్టోర్లలో కంటే యాప్‌లోనే ధరలు తక్కువగా ఉంటాయి. అంతేకాకుండా యాప్‌లో అదనపు ఆఫర్లు, కూపన్లు, స్పెషల్ డిస్కంట్లు అందుబాటులో ఉంటాయి. దీంతో స్టోర్‌కు వెళ్లేటప్పుడు యాప్‌లోని ఆఫర్లను చెక్ చేసుకోవడం మంచిది.

డీమార్ట్‌కు ఏ రోజు వెళ్లాలి..?

డీమార్ట్‌లో వీకెండ్స్‌లో ఎక్కువమంది జనం ఉంటారు. దీంతో శుక్రవారం నుంచి ఆదివారం మధ్య వెళ్లకపోవడం మంచిది. సోమవారం నుంచి గురువారం మధ్య జనం తక్కువగా ఉంటారు. దీంతో ఈ రోజుల్లో వెళితే సాఫీగా షాపింగ్ చేసుకోవచ్చు. ఉదయం స్టోర్ తెరిచిన వెంటనే వెళితే ప్రశాంతంగా అవసరమైన వస్తువులను కొనుగోలు చేయవచ్చు. ఇక మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల మధ్య కూడా రద్దీ తక్కువగా ఉంటుంది. సాయంత్రం వేళల్లో కస్టమర్ల రద్దీ ఎక్కువగా ఉంటుంది. దీంతో ఆ సమయాల్లో డీమార్ట్‌కు వెళ్లకపోవడమే మంచిది. అలాగే ప్రతీ నెలలో 10 నుంచి 25వ తేదీ మధ్య కూడా డీమార్ట్‌లో రద్దీ తక్కువగా ఉండే అవకాశముంది. ప్రతీ నెలా తొలివారంలో ఉద్యోగులకు జీతాలు అందుతాయి. దీంతో తొలివారంలో వెళ్లకపోవడం బెటర్ అని చెప్పవచ్చు.

Follow Us
ఇన్‌స్టాలో మొదలైన ప్రేమకు.. చెరువు గట్టు వద్ద ఎండ్ కార్డు..
ఇన్‌స్టాలో మొదలైన ప్రేమకు.. చెరువు గట్టు వద్ద ఎండ్ కార్డు..
ఒకరిద్దరు కాదు.. ఏకంగా 13 మంది స్టార్ ప్లేయర్లు ఔట్
ఒకరిద్దరు కాదు.. ఏకంగా 13 మంది స్టార్ ప్లేయర్లు ఔట్
ఎంపీ ధర్మేంద్ర ప్రధాన్ ఆధ్వర్యంలో భారీ హర్ ఘర్ తిరంగా ర్యాలీ
ఎంపీ ధర్మేంద్ర ప్రధాన్ ఆధ్వర్యంలో భారీ హర్ ఘర్ తిరంగా ర్యాలీ
అరెరే ఇన్నాళ్లు తెలీదే.. మొక్క మొదట్లో ఇదొక్కటి వేస్తే చాలు
అరెరే ఇన్నాళ్లు తెలీదే.. మొక్క మొదట్లో ఇదొక్కటి వేస్తే చాలు
కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్.. నటనకు గుడ్ బై చెప్పేసి
కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్.. నటనకు గుడ్ బై చెప్పేసి
చేతులతో భోజనం చేస్తున్నారా? చెంచా కంటే ఇది మంచిదా? ఏది బెటర్‌..
చేతులతో భోజనం చేస్తున్నారా? చెంచా కంటే ఇది మంచిదా? ఏది బెటర్‌..
అప్పుడు చిరంజీవి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. తర్వాత చెల్లెలిగా..!
అప్పుడు చిరంజీవి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. తర్వాత చెల్లెలిగా..!
ఉద్యోగం మానేశాక వెంటనే పీఎఫ్ బ్యాలెన్స్ విత్ డ్రా చేస్తే
ఉద్యోగం మానేశాక వెంటనే పీఎఫ్ బ్యాలెన్స్ విత్ డ్రా చేస్తే
వర్షాకాలంలోనే కీళ్ల నొప్పులు ఎందుకు పెరుగుతాయి? అసలు సంగతి ఇదే..
వర్షాకాలంలోనే కీళ్ల నొప్పులు ఎందుకు పెరుగుతాయి? అసలు సంగతి ఇదే..
ఉదయాన్నే వాము నీళ్లు మీరూ తాగుతున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
ఉదయాన్నే వాము నీళ్లు మీరూ తాగుతున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి!