AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra News: ఇన్‌స్టాలో మొదలైన ప్రేమకు.. చెరువు గట్టు వద్ద ఎండ్ కార్డు.. ఐదేళ్ల తర్వాత

పడ్నాడు జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. తాను ప్రేమించిన యువతి మరో వ్యక్తితో మాట్లాడుతూ.. తనను పట్టించుకోవట్లదనే కోపంతో.. ఆమెపై పగ పెంచుకున్న ఓ యువకుడు పక్కా ప్లాన్ చేసి.. ఆమెను అతి కిరాతకంగా హత్య చేశాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

Andhra News: ఇన్‌స్టాలో మొదలైన ప్రేమకు.. చెరువు గట్టు వద్ద ఎండ్ కార్డు.. ఐదేళ్ల తర్వాత
Palnadu Crime News
T Nagaraju
| Edited By: |

Updated on: Aug 09, 2026 | 2:20 PM

Share

తనను పట్టించుకోవట్లేదనే కోపంతో ఓ యువకుడు.. ప్రియురాలిని అతి కిరాతకంగా హత్య చేసిన ఘటన పల్నాడు జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. చిలకలూరిపేటకు చెందిన హసీనా గుంటూరు జిల్లాలోని మిట్లపల్లి కాలేజ్ లో బిటెక్ చదివింది. ఆ సమయంలో పల్నాడు జిల్లా కారంపూడి మండలం ఇనుపరాజుపల్లికి చెందిన బాల సైదులుతో ఆమె ఇన్ స్టాగ్రాంలో పరిచయడం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారింది. గత ఐదేళ్లుగా ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు. బీటెక్ పూర్తి కావడంతో హసీనా సూళ్లూరుపేటలోని ఒక ప్రవేటు కంపెనీలో ఉద్యోగిగా జాయిన్ అయింది. చిలకలూరిపేటలో చదువు పూర్తి కావడంతో స్వంత గ్రామానికి చేరిన బాల సైదులు పొలం పనులు చేస్తున్నాడు.

అయితే ఉద్యోగంలో చేరిన తర్వాత హసీనా బాల సైదులతో మాట్లాడటం తగ్గించింది. దీంతో బాల సైదులు ఆమెను అనుమానించడం మొదలు పెట్టాడు. వేరే వ్యక్తులతో మాట్లాడుతున్నట్లు నిర్ధారణకు వచ్చాడు. దీంతో ఆమెను ఎలాగైనా చంపాలని నిర్ణయం తీసుకున్నాడు. ఈ క్రమంలోనే హసీనాతో మాట్లాడని.. ఆమెను సూళ్లూరు పేట నుండి చిలకలూరిపేట వచ్చేలా చేశాడు. పేట చేరుకున్న హాసీనాను కారంపూడి రావాలని వేడుకున్నాడు. అక్కడి వచ్చిన ఆమెను కాలువ కట్టపై నిర్మానుషంగా ఉన్న ప్రాంతానికి తీసుకెళ్లి వెంట తెచ్చిన కత్తితో పొడిచి చంపేశాడు.ఆ తర్వాత ఆనవాళ్లు దొరకకూడదని భావించి.. పెట్రోల్ పోసి తగులబెట్టి అక్కడ నుండి వెళ్లిపోయాడు.

ఇక ఇప్పుడే వస్తానని చెప్పి ఇంట్లో నుంచి వెళ్లిన హాసినా తిరిగిరాకపోవడంతో కంగారు పడిన ఆమె కుటుంబ సభ్యులు స్థానిక పీఎస్‌లో మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు. బాధితుల ఫిర్యాదుతో ఘటనపై కేసు నమోదు చేసుకన్న పోలీసులు.. హసీనా కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలోనే కారంపూడి మండలంలోని నాగార్జున సాగర్ కాలువ కట్టపై ఓ గుర్తు తెలియని మ్రుతదేహం ఉన్నట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు.. మ్రుతదేహం కొంతమేర కాలిపోయి మిగిలిన భాగం కుళ్లిపోయి ఉన్నట్టు గుర్తించారు.

దీంతో మృతదేహాన్ని గుర్తించేందుకు పోలీసులు అక్కడికక్కడే పోస్టు మార్టమ్ నిర్వహించి.. ఆ బాడీ హసీనాదిగా తేల్చారు. అనంతరంపై కేసు దర్యాప్తులో వేగం పెంచిన పోలీసులు.. నిందితుడిగా అనుమానించిన బాల సైదులను అదుపులోకి తీసుకొని విచారించగా తనే చింపేసినట్లు ఒప్పుకున్నాడు.దీంతో బాల సైదులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు పోలీసులు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి,.

Follow Us
ఇన్‌స్టాలో మొదలైన ప్రేమకు.. చెరువు గట్టు వద్ద ఎండ్ కార్డు..
ఇన్‌స్టాలో మొదలైన ప్రేమకు.. చెరువు గట్టు వద్ద ఎండ్ కార్డు..
ఒకరిద్దరు కాదు.. ఏకంగా 13 మంది స్టార్ ప్లేయర్లు ఔట్
ఒకరిద్దరు కాదు.. ఏకంగా 13 మంది స్టార్ ప్లేయర్లు ఔట్
ఎంపీ ధర్మేంద్ర ప్రధాన్ ఆధ్వర్యంలో భారీ హర్ ఘర్ తిరంగా ర్యాలీ
ఎంపీ ధర్మేంద్ర ప్రధాన్ ఆధ్వర్యంలో భారీ హర్ ఘర్ తిరంగా ర్యాలీ
అరెరే ఇన్నాళ్లు తెలీదే.. మొక్క మొదట్లో ఇదొక్కటి వేస్తే చాలు
అరెరే ఇన్నాళ్లు తెలీదే.. మొక్క మొదట్లో ఇదొక్కటి వేస్తే చాలు
కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్.. నటనకు గుడ్ బై చెప్పేసి
కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్.. నటనకు గుడ్ బై చెప్పేసి
చేతులతో భోజనం చేస్తున్నారా? చెంచా కంటే ఇది మంచిదా? ఏది బెటర్‌..
చేతులతో భోజనం చేస్తున్నారా? చెంచా కంటే ఇది మంచిదా? ఏది బెటర్‌..
అప్పుడు చిరంజీవి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. తర్వాత చెల్లెలిగా..!
అప్పుడు చిరంజీవి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. తర్వాత చెల్లెలిగా..!
ఉద్యోగం మానేశాక వెంటనే పీఎఫ్ బ్యాలెన్స్ విత్ డ్రా చేస్తే
ఉద్యోగం మానేశాక వెంటనే పీఎఫ్ బ్యాలెన్స్ విత్ డ్రా చేస్తే
వర్షాకాలంలోనే కీళ్ల నొప్పులు ఎందుకు పెరుగుతాయి? అసలు సంగతి ఇదే..
వర్షాకాలంలోనే కీళ్ల నొప్పులు ఎందుకు పెరుగుతాయి? అసలు సంగతి ఇదే..
ఉదయాన్నే వాము నీళ్లు మీరూ తాగుతున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
ఉదయాన్నే వాము నీళ్లు మీరూ తాగుతున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి!