AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold: విదేశాల నుంచి భారత్‌కు ఎంత బంగారం తెచ్చుకోవచ్చు..? ఉచిత పరిమితి ఎంత ఉందంటే..?

విదేశాలకు వెళ్లినవారు చాలామంది అక్కడ నుంచి భారత్‌కు గోల్డ్ తెచ్చుకుంటూ ఉంటారు. బంగారు ఆభరణాలను విదేశాల్లో కొనుగోలు చేస్తూ ఉంటారు. అయితే భారత్‌కు తెచ్చుకోవాలంటే కొన్ని నిబంధనలు వర్తిస్తాయి. కస్టమ్స్ డ్యూటీ పరిమితులు ఉంటాయి. మహిళలు ఎంత బంగారం తెచ్చుకోవచ్చనేది ఇప్పుడు తెలుసుకుందాం.

Gold: విదేశాల నుంచి భారత్‌కు ఎంత బంగారం తెచ్చుకోవచ్చు..? ఉచిత పరిమితి ఎంత ఉందంటే..?
Gold Prices
Venkatrao Lella
|

Updated on: Aug 09, 2026 | 10:31 AM

Share

భారతదేశంతో పోలిస్తే దుబాయ్‌తో పాటు కొన్ని దేశాల్లో బంగారం ధర చాలా తక్కువగా ఉంటుంది. అక్కడి ప్రభుత్వాలు గోల్డ్‌పై ట్యాక్సులు, ఇతర సుంకాలు విధించకపోవడం లేదా తక్కువ మొత్తంలో విధించడం వల్ల ధరలు చౌకగా ఉంటాయి. దీంతో విదేశాలకు వెళ్లినవారు అక్కడ బంగారాన్ని కొనుగోలు చేసి భారత్‌కు తెచ్చుకుంటారు. అయితే విదేశాల నుంచి ఇక్కడికి తెచ్చుకోవాలంటే కొన్ని కఠినతరమైన నిబంధనలు ఉంటాయి. ట్యాక్సులు, కస్టమ్స్ సుంకాలు లాంటివి ఉంటాయి. సాధారణ వినియోగదారులు ఎంత తెచ్చుకోవచ్చనే విషయంపై కొన్ని పరిమితులు ఉంటాయి. వీటి గురించి ముందే తెలుసుకోవడం వల్ల ఎయిర్‌పోర్టుల్లో అదనపు ఛార్జీలు, జాప్యాల నుంచి మీరు బయటపడవచ్చు.

మహిళలు ఎంత బంగారం తీసుకోవచ్చు..?

మహిళలు విదేశాల నుంచి భారత్‌కు 40 గ్రాముల వరకు బంగారు ఆభరణాలను తెచ్చుకోచ్చు. ఒక్క రూపాయి కూడా కస్టమ్స్ డ్యూటీ చెల్లించాల్సిన అవసరం ఉండదు. అయితే ఒక ఏడాది కంటే ఎక్కువకాలం విదేశాల్లో నివసించిన భారతీయులకు లేదా భారత సంతతికి చెందినవారికి ఈ రాయితీ వర్తిస్తుంది. అయితే బంగారు నాణేలు, బిస్కెట్లు, కడ్డీలు, ఇతర రూపాల్లో ఉన్న బంగారానికి వేర్వేరు నిబంధనలు వర్తిస్తాయి. కస్టమ్స్ డ్యూటీ మినహాయింపు అనేది బరువు, విలువ రెండింటిపై ఆధారపడి ఉంటుంది. ఆభరణాల బరువు 40 గ్రాముల వరకు  ఉండి కస్టమ్స్ డ్యూటీ ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా ఉండాలంటే వాటి విలువ రూ.లక్ష దాటి ఉండకూడదు. ఇక ఈ మినహాయింపు పొందాలంటే బంగారం కొనుగోలుకు సంబంధించిన పత్రాలు, బిల్లులు మీ వద్ద ఉంచుకోవాలి.

బిల్లులు దగ్గర ఉంచుకోండి

కస్టమ్స్ అధికారులు అడిగితే బిల్లుల వివరాలను సమర్పించాల్సి ఉంటుంది. దీని వల్ల కస్టమ్స్ క్లియరెన్స్ ప్రక్రియ సులభంగా పూర్తవుతుంది. ఇక పరిమితికి మంచి ఆభరణాలు ఉంటే కస్టమ్స్‌కు ప్రకటించండి. అదనపు పరిమితిపై సుంకం విధిస్తారు. ఇక వాణిజ్య అవసరాల కోసం తీసుకెళ్లే ఆభరణాలకు నిబంధనలు వేరుగా ఉంటాయి. వీటిని సామానుగా తీసుకెళ్లడానికి అనుమతి ఉండదు. కేవలం వ్యక్తిగత ఆభరణాలకు మాత్రమే సామానుగా తీసుకెళ్లడానికి అనుమతి ఉంటుంది. కస్టమ్స్ సుంకం రేట్లు, సామాను పరిమితులు ఎప్పటికప్పుడు మారవచ్చు. దీంతో మీరు విదేశాల నుంచి వస్తువులు తెస్తుంటే పరిమితులు, కస్టమ్స్ సుంకాల గురించి తప్పనిసరిగా తెలుసుకోవాలి. దీని వల్ల మీకు ఎలాంటి ఇబ్బందులు అనేవి ఉండవు. అర్హత ప్రమాణాలు, బరువు పరిమితి, విలువ పరిమితిని తెలుసుకోవడం వల్ల విదేశాల నుంచి భారతదేశానికి వచ్చినప్పుడు బంగారు ఆభరణాలను చట్టబద్ధంగా సులువుగా తెచ్చుకోవచ్చు. వీటి గురించి అవగాహన లేకపోతే ఇబ్బందులు రావొచ్చు.

Follow Us