AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Team India: ఒకరిద్దరు కాదు.. ఏకంగా 13 మంది స్టార్ ప్లేయర్లు ఔట్.. ఆందోళనలో టీమిండియా..!

Team India Injuries: కీలక సిరీస్‌ల ముందు కేవలం యంగ్ ప్లేయర్లే కాదు, స్టార్ ఆటగాళ్ళు కూడా మైదానానికి దూరం కావడం టీమిండియాకు పెద్ద ఎదురుదెబ్బ అనడంలో ఎలాంటి సందేహంలేదు. ఎన్సిఏలో చికిత్స పొందుతున్న ఆటగాళ్ళు ఎంత త్వరగా కోలుకుంటారో చూడాలి.

Team India: ఒకరిద్దరు కాదు.. ఏకంగా 13 మంది స్టార్ ప్లేయర్లు ఔట్.. ఆందోళనలో టీమిండియా..!
Team India Injuries
Venkata Chari
|

Updated on: Aug 09, 2026 | 2:19 PM

Share

Team India Injuries: భారత క్రికెట్ అభిమానులకు ఊహించని షాక్ తగిలింది. శ్రీలంకతో జరగబోయే కీలకమైన టెస్టు సిరీస్ ముందుకు ఒకరు కాదు, ఇద్దరు కాదు ఏకంగా 13 మంది భారత ఆటగాళ్ళు గాయాల బారిన పడ్డారు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సహా జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా లాంటి స్టార్ ప్లేయర్లు దూరం కావడంతో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తీవ్ర ఒత్తిడిలో పడిపోయారు.

లంక సిరీస్‌కు ముందు కోలుకోలేని దెబ్బ..

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ రేసులో భారత్‌కు అత్యంత కీలకమైన శ్రీలంక పర్యటన ప్రారంభానికి ముందే గాయాల సమస్య రూపుదిద్దుకుంది. ఆగస్టు 15 నుంచి రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుండగా, భారత క్యాంప్‌లో తీవ్ర ఆందోళన నెలకొంది. లంక ఎలెవన్‌తో జరుగుతున్న ప్రాక్టీస్ మ్యాచ్‌కూ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ వేలి గాయం వల్ల దూరమయ్యాడు. అతని స్థానంలో కేఎల్ రాహుల్ జట్టు బాధ్యతలను భుజాన వేసుకున్నారు. టీమిండియా మేనేజ్‌మెంట్‌ను ఇది కోలుకోలేని దెబ్బగా మారింది.

ఎక్కువమంది చదివినది: ఇది ఇండియన్ టీమా లేక హాస్పిటల్ వార్డా..? ఆ దెబ్బకు రంగంలోకి బిగ్ బాస్..!

ఇవి కూడా చదవండి

ఎన్సిఏలో స్టార్ ప్లేయర్ల పునరావాసం..

గాయపడిన 13 మంది ఆటగాళ్ళు ప్రస్తుతం బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (NCA)లో పునరావాసం పొందుతున్నారు. వీరిలో స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా మోకాలి గాయంతో బాధపడుతుండగా, హార్దిక్ పాండ్యా తొడ కండరాల గాయంతో మైదానానికి దూరమయ్యారు. ఆకాష్ దీప్ వెన్నుముకలో స్ట్రెస్ ఫ్రాక్చర్, రియాన్ పరాగ్ కుడి చేతి మణికట్టు గాయంతో కోలుకుంటున్నారు. నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా హ్యామ్‌స్ట్రింగ్ సమస్యలతో ఇబ్బంది పడుతుండటంతో మ్యాచ్ ఎంపికలకు దూరమయ్యారు. వరుణ్ చక్రవర్తి, సుయాష్ శర్మ, అశోక్ శర్మ, యుధ్‌వీర్ సింగ్, హిమాంశు సింగ్ సైతం వేర్వేరు గాయాలతో చికిత్స పొందుతున్నారు.

సాయి సుదర్శన్ దూరం.. మిగతా వారి పరిస్థితి ఏంటి?

శ్రీలంక టెస్టు సిరీస్‌కు ఎంపికైన యువ బ్యాటర్ సాయి సుదర్శన్ కాలి వేలి ఫ్రాక్చర్ నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదు. దీంతో ఆయన ఈ సిరీస్ మొత్తానికి దూరం కానున్నట్లు సమాచారం వస్తోంది. అయితే దీనిపై బిసిసిఐ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. వాషింగ్టన్ సుందర్ అందుబాటుపై కూడా ఇంకా అనుమానాలు తొలగిపోలేదు. ఇంతమంది ముఖ్యమైన ఆటగాళ్ళు ఒకేసారి గాయాల బారిన పడటం జట్టు ఎంపికను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది.

ఎక్కువమంది చదివినది: వరల్డ్ కప్ 2027 రేసు నుంచి ఆ 2 దిగ్గజ టీంలు ఔట్.. టీమిండియా పరిస్థితి ఏంటంటే?

ముఖ్యమైన టెస్టు సిరీస్ ముంగిట ప్రధాన ఆటగాళ్ళు మైదానానికి దూరం కావడం భారత జట్టుకు పెద్ద ఎదురుదెబ్బే. ఎన్సిఏలో చికిత్స పొందుతున్న ఆటగాళ్ళు ఎంత త్వరగా కోలుకుంటారో వేచి చూడాల్సి ఉంది. బెంచ్ బలం ఆధారంగా గంభీర్ ఈ పరిస్థితిని ఎలా అధిగమిస్తారో చూడాలి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఒకరిద్దరు కాదు.. ఏకంగా 13 మంది స్టార్ ప్లేయర్లు ఔట్
ఒకరిద్దరు కాదు.. ఏకంగా 13 మంది స్టార్ ప్లేయర్లు ఔట్
ఎంపీ ధర్మేంద్ర ప్రధాన్ ఆధ్వర్యంలో భారీ హర్ ఘర్ తిరంగా ర్యాలీ
ఎంపీ ధర్మేంద్ర ప్రధాన్ ఆధ్వర్యంలో భారీ హర్ ఘర్ తిరంగా ర్యాలీ
అరెరే ఇన్నాళ్లు తెలీదే.. మొక్క మొదట్లో ఇదొక్కటి వేస్తే చాలు
అరెరే ఇన్నాళ్లు తెలీదే.. మొక్క మొదట్లో ఇదొక్కటి వేస్తే చాలు
కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్.. నటనకు గుడ్ బై చెప్పేసి
కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్.. నటనకు గుడ్ బై చెప్పేసి
చేతులతో భోజనం చేస్తున్నారా? చెంచా కంటే ఇది మంచిదా? ఏది బెటర్‌..
చేతులతో భోజనం చేస్తున్నారా? చెంచా కంటే ఇది మంచిదా? ఏది బెటర్‌..
అప్పుడు చిరంజీవి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. తర్వాత చెల్లెలిగా..!
అప్పుడు చిరంజీవి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. తర్వాత చెల్లెలిగా..!
ఉద్యోగం మానేశాక వెంటనే పీఎఫ్ బ్యాలెన్స్ విత్ డ్రా చేస్తే
ఉద్యోగం మానేశాక వెంటనే పీఎఫ్ బ్యాలెన్స్ విత్ డ్రా చేస్తే
వర్షాకాలంలోనే కీళ్ల నొప్పులు ఎందుకు పెరుగుతాయి? అసలు సంగతి ఇదే..
వర్షాకాలంలోనే కీళ్ల నొప్పులు ఎందుకు పెరుగుతాయి? అసలు సంగతి ఇదే..
ఉదయాన్నే వాము నీళ్లు మీరూ తాగుతున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
ఉదయాన్నే వాము నీళ్లు మీరూ తాగుతున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
60 ఏళ్లు ఆదాయం ఇచ్చింది.. ఇప్పుడు అందంతో ఆనందాన్ని ఇస్తోంది!
60 ఏళ్లు ఆదాయం ఇచ్చింది.. ఇప్పుడు అందంతో ఆనందాన్ని ఇస్తోంది!