Nani’s Dasara: షురూ అయిన నేచురల్ స్టార్ నయా మూవీ.. ‘దసరా’తో రానున్న నాని
నేచురల్ స్టార్ నాని రీసెంట్ గా శ్యామ్ సింగరాయ్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. రాహుల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది.
Nani’s Dasara: నేచురల్ స్టార్ నాని(Natural Star Nani )రీసెంట్ గా శ్యామ్ సింగరాయ్( Shyam Singha Roy) సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. రాహుల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. విభిన్నమైన కథతో తెరకెక్కిన ఈ మూవీలో నాని తన నటనతో ఆకట్టుకున్నాడు. రొటీన్ కథలను కాకుండా వైవిధ్యమైన చిత్రాలను ఎంచుకుంటూ దూసుకుపోతున్నాడు నాని. తాజాగా మరోసారి విభిన్న పాత్రతో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి రాబోతున్నాడు. నాని- శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో దసరా చిత్రం చేస్తున్నాడు. సుధాకర్ చెరుకూరి తన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఆధ్వర్యంలో దసరాను ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా జాతీయ అవార్డు గెలుచుకున్న కీర్తి సురేష్ నటిస్తుంది.
దసరా సినిమా ఈరోజు (బుధవారం నాడు) పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి అతిధులుగా సుకుమార్, తిరుమల కిషోర్, వేణు ఉడుగుల, శరత్ మండవ హాజరయ్యారు. ముహూర్తం షాట్ కు దర్శకుడు శ్రీకాంత్ తండ్రి చంద్రయ్య కెమెరా స్విచ్ ఆన్ చేయగా, నాని, కీర్తి సురేష్ క్లాప్ కొట్టారు. తిరుమల కిషోర్, సుధాకర్ చెరుకూరి, శ్రీకాంత్ ఓదెల చిత్ర స్క్రిప్ట్ను చిత్ర బృందానికి అందజేశారు. గోదావరిఖనిలోని సింగరేణి కోల్ మైన్స్లో ఉన్న ఒక గ్రామంలో జరిగే కథతో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ మూవీలో నాని మాస్ అండ్ యాక్షన్-ప్యాక్డ్ పాత్రను పోషిస్తున్నాడు. ఆమధ్య విడుదలైన దసరా గ్లింప్స్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. సంతోష్ నారాయణన్ సంగీతం అందించనున్న ఈ చిత్రంలో సముద్రఖని, సాయి కుమార్, జరీనా వహాబ్ ముఖ్య పాత్రాలు పోషిస్తున్నారు. దసరా సినిమా రెగ్యులర్ షూటింగ్ మార్చి, 2022 నుంచి ప్రారంభంకానుంది.
మరిన్ని ఇక్కడ చదవండి :