Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nani: నా సినిమా బ్యాన్ చేస్తా అన్నవాళ్ళందరూ నా కుటుంబసభ్యులే.. నాని ఆసక్తికర కామెంట్స్..

నేచురల్ స్టార్ నాని, రీతు వర్మ జంటగా.. శివ నిర్వాణ దర్శకత్వంలో సన్ షైన్ స్క్రీన్స్ బ్యానర్‌లో నిర్మించిన సినిమా టక్ జగదీష్. ఈ  సినిమా సెప్టెంబర్ 10న..

Nani: నా సినిమా బ్యాన్ చేస్తా అన్నవాళ్ళందరూ నా కుటుంబసభ్యులే.. నాని ఆసక్తికర కామెంట్స్..
Nani
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 01, 2021 | 8:01 PM

Nani: నేచురల్ స్టార్ నాని, రీతు వర్మ జంటగా.. శివ నిర్వాణ దర్శకత్వంలో సన్ షైన్ స్క్రీన్స్ బ్యానర్‌లో నిర్మించిన సినిమా టక్ జగదీష్. ఈ  సినిమా సెప్టెంబర్ 10న అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ అవుతున్న సందర్భంగా ట్రైలర్ లాంచ్  చేశారు. ఈ సందర్భంగా హీరో నాని మాట్లాడుతూ.. డైరెక్టర్ శివ ఎమోషన్స్‌ను బాగా హ్యాండిల్ చెయ్యగలడు. మా టక్ జగదీష్ సినిమా చూసిన వాళ్లకు ఆనంద బాష్పాలు వస్తాయి అన్నారు. పండగ నాడు ఒక మంచి సినిమా చూశాం అనుకుంటారు అందరు. అలాగే టక్ జగదీష్ సినిమాలో మన బాల్యం అనేది చూపించాము అని అన్నారు. నా సినిమా బ్యాన్ చేస్తాము అని అన్నారు. అయితే వాళ్ళందరూ నా కుటుంబ సభ్యులే..వాళ్ల బాధలను నేను అర్థం చేసుకున్నాను. అయితే బయట పరిస్థితులు బాగుండి నా సినిమా థియేటర్లో రిలీజ్ కాకపోతే నాకు నేనే బ్యాన్ చేసుకుంటాను అని నాని అన్నారు. తెలుగు ప్రేక్షకులు మనకు పెద్ద బలం. ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా ఎక్కువ షూటింగ్స్ జరుగుతున్నవి మన దగ్గరే..ప్రేక్షకుల నుంచి మన ఇండస్ట్రీకి మంచి సపోర్ట్ వుంది అని నాని అన్నారు.

డైరెక్టర్…శివ నిర్వాణ మాట్లాడుతూ: నాని కోసం ఎవరు ఏదో మాట్లాడుతున్నారు. కానీ నాని తన ప్రతి సినిమా ప్రసాద్ ఐమాక్స్‌లో 8.30 షో కి గేటు దగ్గర నుంచొని ఆడియన్స్ ఫీలింగ్స్‌ను వాచ్ చేస్తూ వుంటారు అలాంటి నాని మీద ఏదేదో మాట్లాడుతున్నారు. కరోనా పరిస్థితుల్లో ఫ్యామిలీ అందరూ వచ్చి చూస్తారా? అని శివ ప్రశ్నించారు. నేను నాని ఇద్దరం కూడా టక్ జగదీష్ సినిమా థియేటర్స్‌లో ఆ సీన్‌కి అలా రియాక్ట్ అవుతారు… ఈ సీన్‌కి విజిల్స్ వేస్తారు అని చెప్పుకుంటూ పొంగి పోయేవాళ్ళం..అయితే ఈ సినిమా ఓటిటిలో రిలీజ్ అనగానే మేము చాలా డిలా పడ్డాము. మేము నిర్మాతలకు కూడా ఓటిటి వద్దు వెయిట్ చేద్దాం.. థియేటర్స్‌లో రిలీజ్ చేద్దాము..నా రెమ్యునరేషన్, నాని రెమ్యునరేషన్ కూడా తగ్గించి ఇవ్వండి అన్నాము. కానీ…కరోనా సెకండ్ వేవ్ ఏప్రిల్ నుంచి ఇంకా కొనసాగుతూ వుంది.. ఇక ఫైనల్‌గా రిలీజ్ విషయాన్ని నిర్మాతలకు వదిలేసాము. అని క్లారిటీ ఇచ్చారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Chiranjeevi : తమిళనాడు సీఎం స్టాలిన్‌ను కలిసిన మెగాస్టార్ చిరంజీవి..

Sanotosh Shoban’s Prem Kumar : సంతోష్ శోభన్ పెళ్లి కష్టాలు.. ఆకట్టుకుంటున్న ప్రేమ్ కుమార్ ఫస్ట్ గ్లిమ్స్ ..

Vishal: వరుస సినిమాలతో బిజీగా స్టార్ హీరో.. మరో యాక్షన్ ఎంటర్టైనర్‌ను లైన్‌లో పెట్టిన విశాల్..