AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actor Navdeep: టాలీవుడ్ డ్రగ్స్ కేసు.. హీరో నవదీప్ ఇంట్లో నార్కోటిక్స్ అధికారుల సోదాలు..

ఇటీవల మాదాపూర్ పోలీసులు నిర్వహించిన ఆపరేషన్‏లో మొత్తం ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు. అలాగే ఈ కేసులో హీరో నవదీప్‏ను డ్రగ్స్ కన్జ్యూమర్‏గా పేర్కొన్నారు. పోలీస్ రెయిడ్స్ లో పట్టుబడిన రాంచందర్ అనే వ్యక్తి ఇచ్చిన వాంగ్మూలంతో నవదీప్ తనతో కలిసి డ్రగ్స్ తీసుకున్నట్లు రాంచందర్ తెలిపారు. దీంతో నార్కోటిక్ అధికారులు నవదీప్ ను ఈ కేసులో నిందితుడిగా చేర్చారు.

Actor Navdeep: టాలీవుడ్ డ్రగ్స్ కేసు.. హీరో నవదీప్ ఇంట్లో నార్కోటిక్స్ అధికారుల సోదాలు..
Navdeep Pallapolu
Rajitha Chanti
|

Updated on: Sep 19, 2023 | 5:34 PM

Share

టాలీవుడ్ ఇండస్ట్రీలో డ్రగ్స్ కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఈ కేసులో ఇప్పటికే నిందితుడిగా ఉన్న నవదీప్ ఇంట్లో నార్కోటిక్ అధికారులు సోదాలు నిర్వహించారు. పోలీసులు సోదాలు నిర్వహిస్తున్న సమయంలో నవదీప్ ఇంట్లో లేరని తెలుస్తోంది. ఇటీవల మాదాపూర్ పోలీసులు నిర్వహించిన ఆపరేషన్‏లో మొత్తం ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు. అలాగే ఈ కేసులో హీరో నవదీప్‏ను డ్రగ్స్ కన్జ్యూమర్‏గా పేర్కొన్నారు. పోలీస్ రెయిడ్స్ లో పట్టుబడిన రాంచందర్ అనే వ్యక్తి ఇచ్చిన వాంగ్మూలంతో నవదీప్ తనతో కలిసి డ్రగ్స్ తీసుకున్నట్లు రాంచందర్ తెలిపారు. దీంతో నార్కోటిక్ అధికారులు నవదీప్ ను ఈ కేసులో నిందితుడిగా చేర్చారు.

చివరిసారిగా వీరిద్దరు కలిసి గత శనివారం డ్రగ్స్ తీసుకున్నట్లు బయటపెట్టాడని పోలీసులు తెలిపారు. ఈ కేసులో డ్రగ్స్ కన్జ్యూమర్ గా ఉన్న నవదీప్ ను త్వరలోనే అరెస్ట్ చేస్తామని పోలీసులు పేర్కొన్నారు. అయితే డ్రగ్స్ కేసులో తనను అరెస్ట్ చేయవద్దని హైకోర్టును ఆశ్రయించాడు నవదీప్. దీనిపై విచారణ జరిపిన కోర్టు అతడిని అరెస్ట్ చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణలోగా కౌంటర్ దాఖలు చేయాలని స్పష్టం చేసింది. మాదాపూర్ డ్రగ్స్ కేసులో నవదీప్ ను సెప్టెంబర్ 19 వరకు అరెస్ట్ చేయవద్దని టీఎస్ హైకోర్టు పోలీసులను ఆదేశించింది. అయితే మంగళవారం నవదీప్ ఇంట్లో నార్కోటిక్ బ్యూరో సోదాలు నిర్వహించింది. అయితే సోదాలు నిర్వహించే సమయంలో నవదీప్ ఇంట్లో లేరని తెలుస్తోంది.

View this post on Instagram

A post shared by Nav Deep 2.0 (@pnavdeep)

ఇటీవల మాదాపూర్ పోలీసులు నిర్వహించిన ఆపరేషనా్ లో మాజీ ఎంపీ కుమారుడు, సినీ నిర్మాత సహా మరో ఎనిమిది మందిని తెలంగాణ నార్కోటిక్స్ అధికారులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 50 గ్రాముల ఎండీఎంఏ, 24 ఎక్స్టసీ టాబ్లెట్స్, ఎనిమిది గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఇక ఈ కేసులోనే టాలీవుడ్ హీరో నవదీప్ పేరును ప్రస్తావించారు.

View this post on Instagram

A post shared by Nav Deep 2.0 (@pnavdeep)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.