Nayanthara: 'జవాన్' లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత తాజాగా ఓ తమిళ సినిమాకు సైన్ చేసారు నయనతార. ఆ సినిమాకు సంబంధించిన మోషన్ పోస్టర్ విడుదల చేశారు. పురాతన నాణాలతో పాటు కొత్త కరెన్సీ నోట్లు మట్టితో కప్పి ఉంచినట్లుగా డిజైన్ చేసిన ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచేసింది. ఇక మోషన్ పోస్టర్ వీడియోలో అడవి, గుడితో పాటు కళ్ళకు గంతలు కట్టి ఉన్న న్యాయ దేవతను చూపించారు. ఆ తర్వాత 'మన్నన్ గట్టి' అనే టైటిల్ రివిల్ చేస్తూ ఆ టైటిల్ కింద 'Since 1960' అనే క్యాప్షన్ పెట్టారు.