Shyam Singha Roy: ఏ సౌత్ ఇండియన్ మూవీకి దక్కని అరుదైన రికార్డును సొంతం చేసుకున్న శ్యామ్ సింగ రాయ్.. అదేంటంటే

నేచురల్ స్టార్ నాని శ్యామ్ సింగరాయ్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. గత ఏడాది చివరిలో రిలీజ్ అయిన శ్యామ్ సింగరాయ్ సినిమా నాని కెరీర్ లో ఓ మైల్ స్టోన్  నిలిచిపోయింది.

Shyam Singha Roy: ఏ సౌత్ ఇండియన్ మూవీకి దక్కని అరుదైన రికార్డును సొంతం చేసుకున్న శ్యామ్ సింగ రాయ్.. అదేంటంటే
Shyam Singha Roy
Follow us
Rajeev Rayala

|

Updated on: Jan 27, 2022 | 11:52 AM

Shyam Singha Roy: నేచురల్ స్టార్ నాని శ్యామ్ సింగరాయ్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. గత ఏడాది చివరిలో రిలీజ్ అయిన శ్యామ్ సింగరాయ్ సినిమా నాని కెరీర్ లో ఓ మైల్ స్టోన్  నిలిచిపోయింది. చాలా కాలంగా నాని సినిమాలు ఆశించిన స్థాయిలో హిట్స్ అందుకోలేకపోయాయి. దాంతో నాని ఫ్యాన్స్ అంతా నిరాశలో ఉన్నారు. ఇప్పుడు శ్యామ్ సింగరాయ్ సినిమాతో ఒక్కసారిగా తిరిగి వారిలో ఉత్సాహాన్ని నింపాడు నాని.  నాని సరసన సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటించారు. నిహారిక నిహారిక ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై వెంకట్ బోయనపల్లి ఈ చిత్రాన్ని నిర్మించారు. కాగా  కలకత్తా బ్యాక్ గ్రౌండ్ నేపథ్యంలో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‏గా నిలిచింది.  తెలుగుతోపాటు.. తమిళ్, కన్నడ భాషలలో మంచి కలెక్షన్లు వచ్చాయి.  థియేటర్లలోనే కాకుండా ప్రస్తుతం ఓటీటీలో కూడా  ప్రేక్షకులను మెప్పిస్తోందీ చిత్రం. ఈ సినిమాలో నాని డిఫరెంట్ లుక్ లో కనిపించి అలరించారు.

దర్శకుడు రాహుల్ పునః జన్మ ల నేపథ్యంను చాలా చక్కగా చుపించాడని అంటున్నారు కాగా ఈ సినిమాను చూసి మెగాస్టార్ చిరంజీవి, క్రికెటర్ హనుమ విహారి వంటి  ప్రముఖులు చిత్ర బృందంపై ప్రశంసలు వర్షం కురిపించిన వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా ఓటీటీలో రికార్డులు సృష్టిస్తుంది. శ్యామ్ సింగ రాయ్ స్ట్రీమింగ్ అయిన మొదటి మూడు రోజుల్లోనే దాదాపుగా 3.6 లక్షల వ్యూస్ ను దక్కించుకుంది. ఆ వారంలో నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయిన సినిమాలు మరియు వెబ్ సిరీస్ ల్లో టాప్ 10 లో ఒకే ఒక్క ఇండియన్ మూవీ నిలిచింది. ఇప్పటి వరకు ఏ ఒక్క సౌత్ ఇండియన్ మూవీకి దక్కని అరుదైన రికార్డును శ్యామ్ సింగ రాయ్ దక్కించుకుంది. ప్రపంచ వ్యాప్తంగా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయిన సినిమాల్లో టాప్ 3గా నిలిచింది శ్యామ్ సింగ రాయ్.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Pushpa: ఇది వేరే లెవెల్.. శ్రీవల్లి పాటకు నాన్నమ్మతో కలిసి స్టెప్పులేసిన టీమిండియా ఆల్ రౌండర్..

Keerthy Suresh: జోరుమీదున్న కీర్తిసురేష్.. యూట్యూబ్ ఛానెల్ ఓపెన్ చేసిన ముద్దుగుమ్మ..

Chiranjeevi: సినిమా తారలను వదలని మహమ్మారి!! చిరంజీవికి కరోనా పాజిటివ్‌ !! వీడియో