ఓ హీరోయిన్ ప్రపోజ్ చేసింది : నాని

సహజమైన నటనతో నేచురల్ స్టార్ అనిపించుకున్నాడు నాని. ఇటీవల 'వి' సినిమాతో ప్రతి నాయకుడి ఛాయలున్న పాత్రలో ఓటీటీ ద్వారా ప్రేక్షకులను పలుకరించాడు.

  • Ram Naramaneni
  • Publish Date - 5:28 pm, Tue, 8 September 20
   ఓ హీరోయిన్ ప్రపోజ్ చేసింది : నాని

సహజమైన నటనతో నేచురల్ స్టార్ అనిపించుకున్నాడు నాని. ఇటీవల ‘వి’ సినిమాతో ప్రతి నాయకుడి ఛాయలున్న పాత్రలో ఓటీటీ ద్వారా ప్రేక్షకులను పలుకరించాడు. ఈ మూవీలో నాని నటనకు మంచి మార్కులు పడ్డాయి. సినిమా కూడా మంచి రివ్యూలను సొంతం చేసుకుంది. తాజాగా సినిమా ప్రమోషన్ లో భాగంగా ఆంగ్ల మీడియాతో ముచ్చటించాడు నేచురల్ స్టార్. ఈ సందర్భంగాతన లైఫ్ లోని ప్రత్యేకమైన విషయాలను పంచుకున్నాడు.   తనలో దర్శకుడి కంటే నటుడే ఎక్కువగా కనిపిస్తాడని చెప్పుకొచ్చాడు. ‘వి’ సినిమా రిలీజ్ కోసం ఇన్ని రోజులు వెయిట్ చేయడం సవాల్ గా అనిపించిందని చెప్పుకొచ్చాడు. బాలీవుడ్ లో అమితాబ్, విద్యా బాలన్ తో కలిసి నటించాలని ఉందని తెలిపాడు. ఇప్పటివరకు తోటి హీరోయిన్స్ లో ఎవరైనా ప్రపోజ్ చేశారా అని ప్రశ్నించగా, పరోక్షంగా ప్రేమను వ్యక్తపరిచినట్టు షాకింగ్ విషయాన్ని రివీల్ చేశాడు. దీంతో ఆ హీరోయిన్ ఎవరా అని తెగ చర్చించుకుంటున్నారు నెటిజన్లు.

Also Read :

గుడ్ న్యూస్ : కడపలో ఆపిల్ తయారీ యూనిట్ !\

ప్రారంభమైన ఎగుమతులు : పెరిగిన మిర్చి ధరలు