AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కంగనా ఉందని మూవీ నుంచి తప్పుకున్నా: లెజండరీ సినిమాటోగ్రాఫర్‌

సుశాంత్ మరణం తరువాత వివాదాస్పద నటి కంగనా మరోసారి తన గళాన్ని విప్పారు. బాలీవుడ్‌పై విమర్శలు చేయడంతో పాటు

కంగనా ఉందని మూవీ నుంచి తప్పుకున్నా: లెజండరీ సినిమాటోగ్రాఫర్‌
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Sep 08, 2020 | 4:20 PM

Share

Kangana Ranaut News: సుశాంత్ మరణం తరువాత వివాదాస్పద నటి కంగనా మరోసారి తన గళాన్ని విప్పారు. బాలీవుడ్‌పై విమర్శలు చేయడంతో పాటు నెపోటిజం వలనే సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడంటూ ఆమె విమర్శించారు. అంతేకాదు ఇదే అదనుగా తనకు వ్యతిరేకంగా ఉన్న వారిపై ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో ఆమెపై కొన్ని వర్గాల్లో వ్యతిరేకత కూడా వచ్చింది. సుశాంత్ కేసు సాకుతో తన అజెండాతో కంగనా అందరిపై ఆరోపణలు చేస్తోందని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే కంగనా ఉందని తాను ఓ సినిమా నుంచి తప్పుకున్నట్లు లెజండరీ సినిమాటోగ్రాఫర్ వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది.

తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేసిన పీసీ శ్రీరామ్‌.. ”కంగనా రనౌత్‌ ప్రధాన పాత్రలో ఉందని ఒక సినిమాను వదులుకున్నా. ఎందుకో ఆ ప్రాజెక్ట్ చేయడం కోసం నా మనసు ఒప్పుకోలేదు. అదే విషయాన్ని మేకర్లకు చెప్పా. వారు అర్థం చేసుకున్నారు. ఒక్కోసారి మన మనసు చెప్పిందే కరెక్ట్ అనిపిస్తుంటుంది. ఆ టీమ్‌కి ఆల్ ది బెస్ట్”‌ అని కామెంట్ పెట్టారు. ఇక ఆ ట్వీట్‌కి చాలా మంది మంచి నిర్ణయం తీసుకున్నారంటూ కామెంట్లు పెడుతున్నారు.

Read More:

భారత్‌లో రష్యా వ్యాక్సిన్ మూడో దశ ట్రయల్స్!

డ్రగ్స్‌ కేసు.. నటి సంజన అరెస్ట్