భారత్‌లో రష్యా వ్యాక్సిన్ మూడో దశ ట్రయల్స్!

కరోనా కోసం రష్యా తయారు చేసిన స్పుత్నిక్‌-వి వ్యాక్సిన్ మార్కెట్‌లోకి విడుదలైంది. ఈ విషయాన్ని రష్యా ఆరోగ్య శాఖ వెల్లడించింది.

భారత్‌లో రష్యా వ్యాక్సిన్ మూడో దశ ట్రయల్స్!
Follow us

| Edited By:

Updated on: Sep 08, 2020 | 3:56 PM

Russia Corona Vaccine: కరోనా కోసం రష్యా తయారు చేసిన స్పుత్నిక్‌-వి వ్యాక్సిన్ మార్కెట్‌లోకి విడుదలైంది. ఈ విషయాన్ని రష్యా ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ వ్యాక్సిన్ అన్ని రకాల ప్రయోగాల్లో మంచి ఫలితాలు సాధించిందని, త్వరలోనే దీన్ని దేశ వ్యాప్తంగా పంపిణీ చేస్తామని రష్యా ఆరోగ్యశాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది.

ఇదిలా ఉంటే ఇప్పటికే రెండు దశల క్లినికల్ ట్రయల్స్‌ని విజయవంతంగా పూర్తి చేసిన ఈ వ్యాక్సిన్‌.. మూడో దశను పలు దేశాల్లో చేపట్టబోతోంది. ఈ క్రమంలో సౌదీ అరేబియా, బ్రెజిల్‌, ఇండోనేషియా, పిలిప్పీన్స్ వంటి దేశాలు ఇప్పటికే అనుమతిని ఇచ్చాయి. ఇక భారత్‌లోనూ మూడో దశ ట్రయల్స్‌ని ప్రారంభించాలనుకుంటున్న రష్యా అధికారులు, భారత ప్రభుత్వంతో చర్చిస్తున్నారు. భారత్‌లో కూడా అనుమతిని ఇస్తే.. ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాక్సిన్ వీలైనంత త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది.

కాగా కరోనాకు తొలి వ్యాక్సిన్ సిద్దం చేసినట్లు రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఆగష్టు 11న ప్రకటించిన విషయం తెలిసిందే. తన కుమార్తె కూడా ఈ వ్యాక్సిన్ తీసుకుందని, ఇందుకోసం 20 దేశాలు ముందస్తుగా ఆర్డర్ చేశాయని పుతిన్‌ వెల్లడించారు.

Read More:

డ్రగ్స్‌ కేసు.. నటి సంజన అరెస్ట్‌

వివాదంలో ‘ఐపీఎల్‌ యాంథమ్’‌.. లీగల్‌ యాక్షన్‌కి సిద్ధమైన రాపర్‌