వార్ని.. ఎవరీ అమ్మాయి..! అచ్చం ఆ హీరోయిన్‌లానే ఉందే..!! నెట్టింట వైరల్ అవుతున్న వీడియోలు
ప్రపంచంలో మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారనేది నానుడి. ఏడుగురు కాకపోయినా కనీసం ఒకరు, ఇద్దరు ఒకే పోలికలతో ఉన్న వ్యక్తులు మనకు అప్పుడప్పుడు తారసపడుతుంటారు. ముఖ్యంగా సినీ సెలబ్రెటీలు, క్రికెటర్స్ లాంటి వారి విషయంలో ఇలా ఎక్కువగా జరుగుతుంటుంది .

మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని పెద్దలు అంటుంటారు. రియల్ రిలీఫ్ లోనూ చాలా మంది ఒకరిని పోలి ఒకరు మనకు కనిపిస్తూనే ఉంటారు. ఇక చాలా మంది సినీ సెలబ్రెటీల డూప్స్ గాను చేస్తుంటారు. లాంటి బంధుత్వం లేకున్నా ఒకే పోలికలతో కనిపించే వ్యక్తులను ఇంగ్లీష్ లో డొపెల్ గ్యాంగర్స్ లేదా ట్విన్ స్ట్రేంజర్స్ అని పిలుస్తుంటారు. సామాన్యుల కంటే సెలబ్రిటీల విషయంలో ఇలాంటి మనుషులు మనకు ఎక్కువగా తారసపడుతుంటారు. ఇప్పటికే ఐశ్వర్యారాయ, అనుష్కా శర్మ, సమంత, మహేష్ బాబులను పోలిన వ్యక్తులు సోషల్ మీడియాలో బాగా హైలెట్ అయ్యారు. అలాగే సోషల్ మీడియాలోనూ చాలా మంది హీరో, హీరోయిన్స్ డూప్ లుగా వీడియోలు చేస్తూ సందడి చేస్తున్నారు. ఇక ఇప్పుడు ఓ చిన్నారి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇది కూడా చదవండి : ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే మావ..! భరణి మూవీ హీరోయిన్ ఎంత మారిపోయింది.. ఇప్పుడు ఎలా ఉందంటే
పై ఫొటోలో కనిపిస్తున్న అమ్మాయిని చూస్తే మీకు ఏ హీరోయిన్ గుర్తొస్తుంది.? అవును ఆమె చూస్తే ఓ హీరోయిన్ గుర్తొస్తుంది కదా.? ఆమె శ్రీలీల. టాలీవుడ్ సెన్సేషనల్ బ్యూటీ శ్రీలీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తక్కువ సమయంలోనే స్టార్ డమ్ సొంతం చేసుకున్న ఈ అమ్మడు స్టార్ హీరోలతోనూ సినిమాలు చేసి ఆకట్టుకుంది. రవితేజ, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసింది శ్రీలీల. తెలుగులోనే కాదు తమిళ్ లోనూ సినిమాలు చేసింది. ఇటీవలే హిందీలోకి కూడా అడుగుపెట్టింది.
ఇది కూడా చదవండి : సీనియర్ నటి లక్ష్మీ కూతురు తెలుగులో తిరుగులేని నటి..! ఒకప్పుడు హీరోయిన్‌గా అదరగొట్టింది.. ఇప్పుడు ఇలా
ఇక పై అచ్చం శ్రీలీలను పోలి ఉన్న ఆ అమ్మాయి సోషల్ మీడియాలో చాలా పాపులర్. ఆమె ఓ స్ట్రీట్ పర్ఫార్మర్. పొట్టకూటికోసం వీధుల్లో సర్కస్ చేస్తుంటుంది ఆ చిన్నారి. రోడ్డు పై తాడుపై నడుస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తుంది ఆ చిన్నది. ఆమె పేరు అకాషి. సోషల్ మీడియాలో ఆమె చాలా పాపులర్. తన అన్నయ్యతో కలిసి రోడ్డు పై సర్కస్ ఫీట్స్ చేస్తుంటుంది. ఆమె చేసే ఫీట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. అలాగే ఆమెకు సోషల్ మీడియాలో 1.07 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. హీరోయిన్ రేంజ్ లో క్రేజ్ సొంతం చేసుకున్న ఆమె చూడటానికి అచ్చం మన శ్రీలీలలానే ఉంటుంది. నెటిజన్స్ కూడా మీ వీడియోలకు ఇదే కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా ఆమె సర్కస్ ఫీట్ చేస్తున్న సమయంలో కాలికి గాయం అయ్యింది. ఇందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఇది కూడా చదవండి : అలా ఎలా మిస్ అయ్యింది గురూ..! నాని ప్యారడైజ్ సినిమాను ఈ ముద్దుగుమ్మ వదులుకుందా.?
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




