Bimbisara Twitter Review: థియేటర్స్‌లో బింబిసారుడు వీరత్వం.. ‘బింబిసార’ ట్విట్టర్ రివ్యూ..

Rajeev Rayala

Rajeev Rayala |

Updated on: Aug 05, 2022 | 11:21 AM

నందమూరి కళ్యాణ్ రామ్ ప్రయోగాలకు పెట్టింది పేరు. విభిన్న కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు కళ్యాణ్ రామ్.

Bimbisara Twitter Review: థియేటర్స్‌లో బింబిసారుడు వీరత్వం.. 'బింబిసార' ట్విట్టర్ రివ్యూ..
Bimbisara Movie

నందమూరి కళ్యాణ్ రామ్ ప్రయోగాలకు పెట్టింది పేరు. విభిన్న కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు కళ్యాణ్ రామ్. ఈ నందమూరి హీరో నటించిన లేటెస్ట్ హిస్టారికల్ మూవీ బింబిసార( Bimbisara). వశిష్ట అనే నూతన దర్శకుడు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు మొదటి నుంచి మంది బజ్ ఉంది. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ బింబిసారుడిగా కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన ప్రతి పోస్టర్, గ్లిమ్ప్స్ , టీజర్, ట్రైలర్, పాటలు.. ఇలా అన్ని ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. దాంతో ఈ సినిమా పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. అటు కళ్యాణ్ రామ్ కూడా ఈ సినిమా పై చాలా ధీమాగా ఉన్నారు. దాంతో బింబిసార ఖచ్చితంగా హిట్ అవుతుందని ఫిక్స్ అయ్యారు నందమూరి అభిమానులు.

బింబిసార సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ అవుతుంది. కాగా ఈ సినిమా ప్రీమియర్స్ చూసిన ప్రేక్షకులు ట్విట్టర్ వేదికగా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అంటూ ట్వీట్స్ చేస్తున్నారు. కళ్యాణ్ తన నట విశ్వరూపంతో ఆకట్టుకున్నారని కొనియాడుతున్నారు కొందరు. ఇక ఈ సినిమాలో భీమ్లా నాయక్ బ్యూటీ సంయుక్త మీనన్, కేథరిన్  కథానాయికలుగా నటించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి 

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu