Rambha: షాకింగ్ లుక్‌లో స్టార్ హీరోయిన్.. నెట్టింట వైరల్ అవుతోన్న ఫొటోస్..
ఒకప్పుడు స్టార్ హీరోయిన్స్ గా చక్రం తిప్పిన భామలు.. ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. నిన్న మొన్నటివరకు వేరే లుక్ ఉన్న హీరోయిన్స్ ఒక్కసారిగా గుర్తుపట్టలేని లుక్ లో ప్రత్యక్షం అయ్యి షాక్ ఇస్తున్నారు.
ఒకప్పుడు స్టార్ హీరోయిన్స్ గా చక్రం తిప్పిన భామలు.. ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. నిన్న మొన్నటివరకు వేరే లుక్ ఉన్న హీరోయిన్స్ ఒక్కసారిగా గుర్తుపట్టలేని లుక్ లో ప్రత్యక్షం అయ్యి షాక్ ఇస్తున్నారు. ఇదిలా ఉంటే ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా రాణించిన ముద్దుగుమ్మ రంభ(Rambha) ఒకరు. రంభ అసలు పేరు విజయలక్ష్మి. ఈ అమ్మడు అప్పట్లో ఒక ఊపు ఊపింది. మోస్ట్ గ్లామరస్ హీరోయిన్ గా రాణించింది ఈ బ్యూటీ. మెగాస్టార్, వెంకటేష్, నాగార్జున ఇలా స్టార్ హీరోల సరసన సినిమాలు చేసి అలరించారు రంభ. అలాగే ఈ తరం హీరోలైన తారక్, అల్లు అర్జున్ సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ లో కూడా నటించి మెప్పించారు. ఆ తర్వాత పెళ్లి చేసుకొని సెటిల్ అయ్యారు.
తాజాగా రంభ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా నటి కుష్భు రంభను కలిశారు. చాలా కాలం తర్వాత తన స్నేహితురాలు రంభను కలిసి ఆమె కుటుంబంతో మంచి టైం స్పెండ్ చేశారు కుష్బూ. ఈ విషయాన్నీ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. అలాగే రంభతో ఆమె పిల్లలతో దిగిన సెల్ఫీలను షేర్ చేశారు. ఈ ఫొటోస్ లో రంభను చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఆమె ఇప్పటికి అంతే అందంగా.. అదే గ్లామర్ తో కనిపించడంతో అంతా షాక్ అవుతున్నారు. వయసు పెరుగుతున్నా ఆమె అందం మాత్రం తరగడం లేదు అంటూ కామెంట్ చేస్తున్నారు. అయితే ఈ ఫోటోలు మేకప్ లేకుండా ఉన్నారు రంభ.. అదే మేకప్ వేస్తే ఇప్పటికి హీరోయిన్లకు గట్టి పోటీ ఇచేలానే ఉన్నారు. ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్న రంభ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వాలని ఆమె అభిమానులు ఎప్పటినుంచి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది వెబ్ సిరీస్ లని, సినిమాలని రీ ఎంట్రీ ఇస్తునానఁ విషయం తెలిసిందే.. మరి రంభ కూడా రీఎంట్రీ ఇస్తారేమో చూడాలి.
View this post on Instagram