AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BiggBossTelugu6: గెట్ రెడీ ఆడియన్స్.. బిగ్ బాస్ నయా సీజన్ రాబోతుంది.. అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన యాజమాన్యం

తెలుగులో రియాలిటీ షోల్లో నెంబర్ వన్ గా దూసుకుపోయిన గేమ్ షో బిగ్ బాస్. పలు భాషల్లో విజయవంతంగా టెలికాస్ట్ అయిన బిగ్ బాస్ తెలుగులోనూ టాప్ రేటింగ్ తో దూసుకుపోతోన్న విషయం తెలిసిందే.

BiggBossTelugu6: గెట్ రెడీ ఆడియన్స్.. బిగ్ బాస్ నయా సీజన్ రాబోతుంది.. అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన యాజమాన్యం
Bigg Boss 6
Rajeev Rayala
|

Updated on: Aug 04, 2022 | 9:30 PM

Share

తెలుగులో రియాలిటీ షోల్లో నెంబర్ వన్ గా దూసుకుపోయిన గేమ్ షో బిగ్ బాస్( BiggBoss). పలు భాషల్లో విజయవంతంగా టెలికాస్ట్ అయిన బిగ్ బాస్ తెలుగులోనూ టాప్ రేటింగ్ తో దూసుకుపోతోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే బిగ్ బాస్ సీజన్స్ 5 పూర్తయిన విషయం తెలిసిందే. మోడై షోకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా చేసి అదరగొట్టారు, సినిమాల్లో నటనతో ఆకట్టున్న తారక్, బిగ్ బాస్ హోస్ట్ గా తనదైన ముద్ర వేశారు. మొదటి సీజన్ ను సూపర్ డూపర్ గా రన్ చేశారు. ఆతర్వాత నేచురల్ స్టార్ నాని బిగ్ బాస్ సీజన్ 2 కు హోస్ట్ గా వ్యవహరించారు. అయితే సీజన్ వన్ తో పోల్చుకుంటే సీజన్ 2 కాస్త పేలగా సాగిందనే చెప్పాలి. ఇక ఆ  తర్వాత బిగ్ బాస్ బాధ్యతను తీసుకున్నారు కింగ్ నాగార్జున.

నాగార్జున హోస్ట్ గా బిగ్ బాస్ సీజన్ 3,4,5 లను హోస్ట్ చేశారు. అలాగే ఈ మధ్య వచ్చిన బిగ్ బాస్ నాన్ స్టాప్ కు కూడా నాగార్జున హోస్ట్ గా చేశారు. ఇక ఇప్పుడు సీజన్ 6తో సిద్దమయ్యింది బిగ్ బాస్. తాజాగా సీజన్ 6 త్వరలోనే ప్రారంభం కానుందని అనౌన్స్ చేసింది స్టార్ మా యాజమాన్యం. త్వరలోనే ఈ సీజన్ 6 ప్రారంభం అవ్వనుందని.. బిగ్ బాస్ లోగోను రిలీజ్ చేసింది. దాంతో ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఈసారి హౌస్ లోకి ఎవరు వెళ్లనున్నారన్న చర్చ మొదలైంది. మరి ఈసారి బిగ్ బాస్ లో ఏ తారలు సందడి చేస్తారో చూడాలి. అలాగే ఈ సీజన్ కు నాగార్జునే హోస్ట్ గా వ్యవహరిస్తారా లేక మరో హీరో ఎంట్రీ ఇస్తాడేమో చూడాలి..

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Follow Us
గర్భవతినని బాస్‌కి మెసేజ్ చేసిన మహిళ.. 3 గంటల్లోనే ఉద్యోగం ఊస్ట్‌
గర్భవతినని బాస్‌కి మెసేజ్ చేసిన మహిళ.. 3 గంటల్లోనే ఉద్యోగం ఊస్ట్‌
తెలంగాణ విద్యార్థులకు అలెర్ట్.. జూలై 24న విద్యాసంస్థల బంద్‌..!
తెలంగాణ విద్యార్థులకు అలెర్ట్.. జూలై 24న విద్యాసంస్థల బంద్‌..!
మీపేరు మీద వేరేవాళ్ళు SIM వాడుతున్నారా? గుర్తించడం ఎలా?
మీపేరు మీద వేరేవాళ్ళు SIM వాడుతున్నారా? గుర్తించడం ఎలా?
మేక పిల్లల కోసం దారుణం.. మాజీ సర్పంచ్ దాడిలో పశువుల కాపరి బలి!
మేక పిల్లల కోసం దారుణం.. మాజీ సర్పంచ్ దాడిలో పశువుల కాపరి బలి!
చూసేందుకు కంటిలో నలుసంత.. కానీ దగ్గు, ఆస్తమాకు చెక్ పెట్టేస్తుంది
చూసేందుకు కంటిలో నలుసంత.. కానీ దగ్గు, ఆస్తమాకు చెక్ పెట్టేస్తుంది
గురు పూర్ణిమ నుంచి మహర్దశ.. ఇక ఈ రాశుల వారికి తిరుగుండదు!
గురు పూర్ణిమ నుంచి మహర్దశ.. ఇక ఈ రాశుల వారికి తిరుగుండదు!
పేపర్ లీక్‌లపై కేంద్రంపై రాహుల్ గాంధీ ఫైర్..!
పేపర్ లీక్‌లపై కేంద్రంపై రాహుల్ గాంధీ ఫైర్..!
స్కూలు అయిపోగానే తాళం వేసి వెళ్లిపోయిన టీచర్‌.. ఆ తర్వాత
స్కూలు అయిపోగానే తాళం వేసి వెళ్లిపోయిన టీచర్‌.. ఆ తర్వాత
అడ్వాన్స్ తీసుకొని సుతారి మేస్త్రీ పనికి రాకుంటే కేసు పెట్టొచ్చా?
అడ్వాన్స్ తీసుకొని సుతారి మేస్త్రీ పనికి రాకుంటే కేసు పెట్టొచ్చా?
ఇకపై బహిరంగ మూత్ర విసర్జన చేశారో.. ఇక మీ పని అవుట్
ఇకపై బహిరంగ మూత్ర విసర్జన చేశారో.. ఇక మీ పని అవుట్