హీరోగా ఎంట్రీ ఇవ్వనున్న హరికృష్ణ మనవడు.. ఆనందంలో నందమూరి ఫ్యాన్స్

నందమూరి ఫ్యామిలీ నుంచి మరో హీరో రానున్నాడు. హరికృష్ణ కొడుకు జానకిరామ్ తనయుడు ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడని తెలుస్తోంది. హరికృష్ణ పెద్ద కొడుకు నందమూరి జానకి రామ్ ఓ రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. ఆతర్వాత హరికృష్ణ కూడా రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. ఈ వరుస మరణాలు నందమూరి అభిమానులను తీవ్రంగా కలిచివేసింది.

హీరోగా ఎంట్రీ ఇవ్వనున్న హరికృష్ణ మనవడు.. ఆనందంలో నందమూరి ఫ్యాన్స్
Nandamuri Janakiram Son Tar
Follow us
Rajeev Rayala

|

Updated on: Mar 26, 2024 | 1:35 PM

నందమూరి ఫ్యామిలీ నుంచి ఇప్పటికే చాలా మంది హీరోలు వచ్చి ప్రేక్షకులను అలరిస్తున్నారు. సీనియర్ ఎన్టీఆర్ తర్వాత బాలకృష్ణ, హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, తారకరత్న ఈ హీరోలంతా ఇండస్ట్రీలో తమ సత్తా చాటారు. ఇక ఇప్పుడు నందమూరి ఫ్యామిలీ నుంచి మరో హీరో రానున్నాడు. హరికృష్ణ కొడుకు జానకిరామ్ తనయుడు ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడని తెలుస్తోంది. హరికృష్ణ పెద్ద కొడుకు నందమూరి జానకి రామ్ ఓ రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. ఆతర్వాత హరికృష్ణ కూడా రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. ఈ వరుస మరణాలు నందమూరి అభిమానులను తీవ్రంగా కలిచివేశాయి. అయితే ఇప్పుడు జానకీరామ్ తనయుడు తారక రామారావు హీరోగా ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాడని తెలుస్తోంది.

టాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు అందించిన వైవీఎస్‌ చౌదరి ఇప్పుడు జానకీరామ్ తనయుడిని హీరోగా పరిచయం చేయనున్నాడట. సీతారామరాజు, సీతారాముల కళ్యాణం చూతము రారండి, యువరాజు, లాహిరి లాహిరి లాహిరిలో, సీతయ్య, దేవదాసు సినిమాలతో ప్రేక్షకులనుయ్ మెప్పించిన వైవిఎస్ చౌదరి.. చివరిగా సాయి ధరమ్ తేజ్ తో రేయ్ అనే సినిమా చేశాడు. ఈ సినిమాతోనే సాయి ధరమ్ తేజ్ పరిచయం అవ్వాలి కానీ అంతకంటే ముందే పిల్లా నువ్వులేని జీవితం రిలీజ్ అయ్యింది.

ఇక ఇప్పుడు తారకరామారావుతో కలిసి ఓ అదిరిపోయే సినిమా చేయనున్నారట వైవీఎస్‌ చౌదరి.  అందమైన ప్రేమకథగా ఈ సినిమా ఉండనుందట. అలాగే తెలుగు సంస్కృతి, సంగీతం, సాహిత్యం అన్ని కలబోసిన కథను సిద్ధం చేశారట వైవీఎస్. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా ఓ తెలుగమ్మాయిని అనుకుంటున్నారట. త్వరలోనే దీని పై పూర్తి క్లారిటీ రానుంది. గతంలో జానకి రామ్ తనయుడు పిల్లలతో తెరకెక్కిన ‘దానవీర శూర కర్ణ’లో కృష్ణుడి పాత్రలో నటించాడు. ఇక ఇప్పుడు హీరోగా అలరించడానికి రెడీ అవుతున్నాడు. ఈ యంగ్ హీరోను సపోర్ట్ చేయడానికి నందమూరి అభిమానులంతా సిద్ధంగా ఉన్నారు. నందమూరి ఫ్యామిలి నుంచి కొత్త హీరో వస్తుండటంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

జూనియర్ ఎన్టీఆర్ ట్విట్టర్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.