- Telugu News Photo Gallery Cinema photos Actress Sreeleela movie opportunities have increased after Guntur karam Telugu Heroines Photos
Sreeleela: పాపం శ్రీలీలకు ఎంత కష్టమొచ్చింది.! అవకాశాలు తగ్గినట్టేనా.?
దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. ఆపర్లు ఉండగానే అందిపుచ్చుకోవాలి. కొన్నిసార్లు కారణాలు ఏవీ లేకపోయినా, ఉన్నట్టుండి జీవితం ఖాళీగా ఉన్నట్టు అనిపిస్తుంది. అప్పటిదాకా ఉన్న బిజీ గుర్తుకొస్తే మరింతగా ఉస్సూరుమనిపిస్తుంది. ఏమిటి శ్రీలీలా అంతేనా.? అదేంటి శ్రీలీలను ప్రస్తావిస్తున్నారు ఈ మాటలకూ, శ్రీలీలకూ లింకేంటి అంటారా? వామ్మో... ఆ ఆఫర్లేంటి? ఆ క్రేజీ ప్రాజెక్టులేంటి? అసలు శ్రీలీలకు తినడానికైనా టైమ్ ఉంటోందా? లేదా?
Updated on: Mar 26, 2024 | 1:13 PM

దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. ఆపర్లు ఉండగానే అందిపుచ్చుకోవాలి. కొన్నిసార్లు కారణాలు ఏవీ లేకపోయినా, ఉన్నట్టుండి జీవితం ఖాళీగా ఉన్నట్టు అనిపిస్తుంది. అప్పటిదాకా ఉన్న బిజీ గుర్తుకొస్తే మరింతగా ఉస్సూరుమనిపిస్తుంది. ఏమిటి శ్రీలీలా అంతేనా.?

అదేంటి శ్రీలీలను ప్రస్తావిస్తున్నారు ఈ మాటలకూ, శ్రీలీలకూ లింకేంటి అంటారా? వామ్మో... ఆ ఆఫర్లేంటి? ఆ క్రేజీ ప్రాజెక్టులేంటి? అసలు శ్రీలీలకు తినడానికైనా టైమ్ ఉంటోందా? లేదా?

అన్ని షిఫ్టులు పనిచేసినమ్మాయి అంత ఎనర్జిటిక్‌గా ఎలా కనిపిస్తోంది? లాస్ట్ ఇయర్ సినిమా సర్కిల్స్ లో గ్లామర్ గురించి ప్రస్తావన వచ్చిన ప్రతిసారీ వినిపించిన మాటలివి.

బెస్ట్ డ్యాన్సర్, లక్కీ హీరోయిన్ అంటూ వరుసగా అవకాశాలను కొల్లగొట్టేశారు తెలుగు బ్యూటీ శ్రీలీల. 2023 ఎండింగ్‌లో ఆమె నటించిన సినిమాలు అంతగా బాక్సాఫీస్‌ని షేక్ చేయలేకపోయాయి.

కానీ ఆ కొరతను తీర్చడానికి ఈ ఏడాది గుంటూరుకారం పక్కా హిట్‌గా రిజిస్టర్ అయింది. ఈ మధ్యదాకా ఈ సందడిని సెలబ్రేట్ చేసుకున్న శ్రీలీల, ఇప్పుడు ఖాళీ ఖాళీగా కనిపిస్తున్నారు.

నవీన్ పొలిశెట్టితో ఈ బ్యూటీ చేయాల్సిన సినిమా ఎప్పుడు మొదలవుతుందో క్లూ లేదు. అటు విజయ్ దేవరకొండతో చేయాల్సిన సినిమా ముహూర్తం ఎప్పుడో ఇంకా కరెక్ట్ గా క్లారిటీ లేదు.

సో ఆ ప్రాజెక్టులు స్టార్ట్ అయ్యేవరకు కాస్త ఊపిరి పీల్చుకునే టైమ్ ఉంటుంది ఈ బ్యూటీకి. దాదాపు రెండేళ్ల తర్వాత దొరికిన ఈ గ్యాప్‌ని, ఇష్టమైన వాటితో ఫిల్ చేయడానికి రెడీ అవుతున్నారు గ్లామర్ గర్ల్.




