Veera Simha Reddy: బాలకృష్ణ- శ్రుతి హాసన్‌ రాకింగ్ కెమిస్ట్రీ.. మాస్ మొగుడు సాంగ్ వచ్చేది అప్పుడే

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 'వీరసింహారెడ్డి' చిత్రం సంక్రాంతి కానుకగా ఈ నెల 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌‌గా విడుదలకు సిద్ధమవుతోంది.

Veera Simha Reddy: బాలకృష్ణ- శ్రుతి హాసన్‌ రాకింగ్ కెమిస్ట్రీ.. మాస్ మొగుడు సాంగ్ వచ్చేది అప్పుడే
Veera Simha Reddy
Follow us
Rajeev Rayala

|

Updated on: Jan 01, 2023 | 8:03 PM

గాడ్ ఆఫ్ మాసస్ నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న సినిమా వీరసింహారెడ్డి. క్రాక్ సినిమాతో బ్లాక్‌ బస్టర్ అందుకున్న మేకర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ‘వీరసింహారెడ్డి’ చిత్రం సంక్రాంతి కానుకగా ఈ నెల 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌‌గా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నెల 6న ఒంగోలులో నిర్వహించనున్న ప్రీ రిలీజ్ ఈవెంట్‌ లో ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ ను విడుదల చేయనున్నారు. అంతకంటే ముందు ఈ చిత్రంలోని నాల్గవ పాట- మాస్ మొగుడు లిరికల్ వీడియో జనవరి 3వ తేదీ సాయంత్రం 7:55 గంటలకు విడుదల కానుంది. బాలకృష్ణ, శ్రుతి హాసన్ ల రాకింగ్ కెమిస్ట్రీని చూపించే పోస్టర్ ద్వారా సాంగ్ డేట్ ని ప్రకటించారు. బాలకృష్ణ ట్రెడిషనల్ వేర్ లో రాయల్ గా కనిపించగా, శ్రుతి హాసన్ ట్రెండీ డ్రెస్ లో గ్లామర్ గా కనిపిస్తోంది. మాస్ మొగుడు థమన్ మార్క్ మాస్ నంబర్‌ గా ఉండబోతోంది.

ఈ చిత్రంలో దునియా విజయ్, వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ చిత్రానికి రిషి పంజాబీ సినిమాటోగ్రఫర్ గా పని చేస్తున్నారు. స్టార్ రైటర్ సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ అందించగా, నవీన్ నూలి ఎడిటర్ గా, ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు. చందు రావిపాటి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి రామ్-లక్ష్మణ్, వెంకట్ ఫైట్ మాస్టర్స్ గా పని చేస్తున్నారు.

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!