AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Balakrishna: ఆసుపత్రిలో బాలకృష్ణ.. సర్జరీ చేసిన వైద్యులు.. హెల్త్ అప్డేట్..

నందమూరి నటసింహం బాలకృష్ణ ఆసుపత్రిలో చేరారు.. హైదరాబాద్‏ .బంజారాహిల్స్‏లోని కేర్ ఆసుపత్రిలో

Balakrishna: ఆసుపత్రిలో బాలకృష్ణ.. సర్జరీ చేసిన వైద్యులు.. హెల్త్ అప్డేట్..
Balakrishna
Rajitha Chanti
|

Updated on: Nov 02, 2021 | 5:56 PM

Share

నందమూరి నటసింహం బాలకృష్ణ ఆసుపత్రిలో చేరారు.. హైదరాబాద్‏ .బంజారాహిల్స్‏లోని కేర్ ఆసుపత్రిలో ఆయనకు ఈరోజు సర్జరీ చేశారు వైద్యులు. కుడి చేతి భుజం నొప్పితో బాలకృష్ణ ఆసుపత్రిలో చేరారు… ఈరోజు బాలకృష్ణకు సర్జరీ చేసిన కేర్ ఆసుపత్రి వైద్యులు. దాదాపు నాలుగు గంటలపాటు సర్జరీ జరిగినట్లుగా తెలుస్తోంది. బాలకృష్ణ ఆరోగ్యం గురించి అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు.

బాలకృష్ణ గత ఆరు నెలలుగా కుడి భుజం నొప్పితో బాధపడుతున్నారని.. ఈ క్రమంలోనే బంజారాహిల్స్ కేర్ ఆసుపత్రిలో చేరారని కేర్ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. తమతో మాట్లాడుతున్నంతసేపు.. బాలయ్య తన కుడి చేతిని ఎత్తలేకపోయాడని.. అంతేకాకుండా.. విపరీతమైన నొప్పితో బాధపడుతున్నట్లుగా గమనించామని వైద్యులు తెలిపారు. ఎంఆర్ఐ స్కాన్ చేసిన తర్వాత బంజారాహిల్స్‏లోని కేర్ ఆసుపత్రిలోని డాక్టర్ రఘువీర రెడ్డి.. డాక్టర్ బీఎన్ ప్రసాద్ నేతృత్వంలోని ఆర్థోపెడిక్ సర్జన్ల బృందం.. బాలకృష్ణ భుజం కండరాల స్నాయువులను సరిచేయడానికి దాదాపు 4 గంటలు శస్త్రచికిత్స చేశారు. సర్జరీ అనంతరం బాలకృష్ణ ఆరోగ్యం మెరుగ్గానే ఉందని.. ప్రస్తుతం డిశ్చార్జీకి సిద్ధంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. ఈ రోజు సాయంత్రం డిశ్చార్జ్ కానున్నారు. బాలకృష్ణకు ఆరు వారాలపాటు విశ్రాంతి అవసరం అని డాక్టర్లు సూచించారు.

ఇక ప్రస్తుతం బాలకృష్ణ.. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో బాలయ్య ‘అన్‌స్టాపబుల్స్‌ పేరుతో టాక్ షో చేస్తున్నాడు. అలాగే బాలయ్య తన తదుపరి చిత్రాన్ని గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఓ మూవీ చేయబోతున్నాడు.

Also Read: Bigg Boss 5 Telugu: నెట్టింట్లో వైరల్ అవుతున్న లోబో రెమ్యునరేషన్.. ఇంతకీ ఎంత తీసుకున్నాడంటే..

Puneeth Raj Kumar: పునీత్ రాజ్ కుమార్ కుటుంబాన్ని పరామర్శించిన నాగార్జున..

Kasturi Shankar: కమింగ్ సూన్.. ఆప్ ట్రావెల్స్ అండ్ టూర్స్.. నటీ కస్తూరి షాకింగ్ కామెంట్స్ వైరల్..