Nandamuri Balakrishna: అఖండ తర్వాత అమెరికాకు బాలయ్య.. గోపీచంద్ సినిమా అక్కడే..
బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో అఖండ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో నటసింహం ద్విపాత్రాభినయం చేయనున్నారట
Nandamuri Balakrishna: బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో అఖండ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో నటసింహం ద్విపాత్రాభినయం చేయనున్నారని అంటున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ , పాటలు అభిమానుల్లో అంచనాలను ఆకాశానికి చేర్చాయి. ఇక బాలయ్య – బోయపాటి కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే సింహ, లెజెండ్ సినిమాలతో బ్లాక్ బస్టర్స్ అందుకున్నారు ఈ ఇద్దరు. ఇప్పుడు ఈ కాంబోలో రానున్న అఖండ సినిమా పై భారీ బజ్ క్రియేట్ అయ్యింది. ఇక ఈ సినిమా తర్వాత క్రాక్ దర్శకుడు గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో సినిమా చేస్తున్నారు బాలయ్య. ఈ సినిమాలో పొడుగు కాళ్ళ సుందరి శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇటీవలే ఈ సినిమా పూజాకార్యక్రమాలు జరుపుకుంది. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను మొదలుపెట్టనున్నారు.
బాలయ్య కోసం అదిరిపోయే కథను సిద్ధం చేశాడట గోపీచంద్.అయితే ఈ సినిమా కథ పరంగా ఎక్కువ భాగం అమెరికాలో షూట్ చేయనున్నారట. ఈ సినిమాలో కూడా బాలయ్య డ్యూయల్ రోల్ లో కనిపించనున్నారని టాక్. అలాగే బాలయ్య ఎన్నారై గా కనిపిస్తారంటూ ప్రచారం కూడా జరుగుతుంది. మొన్నీమధ్య ఈ సినిమాలో బాలయ్యను పోలీస్‌గా చూపించబోతున్నాడని కొందరు.. లేదు ఫ్యాక్షనిస్ట్‌గా చూపిస్తాడని మరి కొందరు గుసగుసలాడుకుంటున్నారు. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే బాలయ్య సినిమాకోసం శ్రుతి భారీగా రెమ్యునరేషన్ అందుకుంటుందని తెలుస్తుంది. ఇక ఈ సినిమాకు తమన్ సంగీతం అందించనున్నారు. ఈ సినిమా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి :