AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Thalapathy vijay : వంశీ పైడిపల్లి సినిమాలో దళపతి విజయ్ అలా కనిపించనున్నారట..

దళపతి విజయ్ సినిమా వస్తుందంటే ఆయన అభిమానులకు పండగే. కేవలం తమిళ్ లోనే కాదు తెలుగులోనూ విపరీతమైన క్రేజ్ ఉంది విజయ్‌కి

Thalapathy vijay : వంశీ పైడిపల్లి సినిమాలో దళపతి విజయ్ అలా కనిపించనున్నారట..
Vijay
Rajeev Rayala
|

Updated on: Nov 20, 2021 | 9:23 AM

Share

Thalapathy vijay : దళపతి విజయ్ సినిమా వస్తుందంటే ఆయన అభిమానులకు పండగే. కేవలం తమిళ్ లోనే కాదు తెలుగులోను విపరీతమైన క్రేజ్ ఉంది విజయ్ కి. ఆయన నటించిన సినిమాలు తెలుగులో కి డబ్ అయ్యి భారీ విజయాలను అందుకున్నాయి. ఇటీవల విజయ్ నటించిన సినిమాలు అనీ 100 కోట్ల మార్క్ ను చాలా సులువుగా క్రాస్ చేశాయి. తుపాకీ సినిమానుంచి విజయ్ నటించిన సినిమాలు దాదాపు బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. చివరగా మాస్టర్ సినిమాతో హిట్ అందుకున్నారు విజయ్. ఇక ఇప్పుడు బీస్ట్ సినిమాతో రావడానికి సిద్ధంగా ఉన్నాడు దళపతి.  నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా, వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.  ఈ సినిమాలో బుట్టబొమ్మ పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.

ఈ సినిమా తర్వాత తెలుగు సినిమా చేయనున్నాడు విజయ్. టాలెంటెడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దళపతి ఓ సినిమాకి చేయనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకోసం అదిరిపోయే కథను సిద్ధం చేశారు వంశీ. ప్రస్తుతం ఈ సినిమాలో ఇతర పాత్రలను ఎంపిక చేసే పనిలో ఉన్నాడు వంశీ. ఇదిలా ఉంటే ఈ సినిమాలో విజయ్ పాత్ర చాలా డిఫరెంట్ గా ఉండనుందని తెలుస్తుంది. ఈ సినిమాలో విజయ్ ఒక రకమైన మానసిక వ్యాధితో బాధపడుతూకనిపిస్తారట. తన మనసుకు నచ్చిన వారితో గడపుతున్నట్టు ఊహించుకుంటూ ఉంటారట. ఇలాంటి వైవిధ్యమైన పాత్రను విజయ్ కోసం సృష్టించారట వంశీ. మరి ఈ వార్తల్లో వాస్తవం ఎంత అన్నది తెలియాల్సి ఉంది.

మరిన్ని ఇక్కడ చదవండి :

Keerthy Suresh: బ్యాక్ టు బ్యాక్ మూవీస్‌తో ఫుల్ బిజీ అయిన బ్యూటీ.. హోమ్ బ్యానర్‌లో సినిమా మొదలుపెట్టిన కీర్తి సురేష్..

సినిమా కోసం కష్టపడుతున్న అందాల భామ.. ఇంతకు ఈ ఫొటోలో ఉన్న బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా..?

Priyanka Chopra: క్రిస్మస్‌ కానుకగా రానున్న మ్యాట్రిక్స్4.. కొత్త పోస్టర్‌ను షేర్‌ చేసిన ప్రియాంక..