సినిమా కోసం కష్టపడుతున్న అందాల భామ.. ఇంతకు ఈ ఫొటోలో ఉన్న బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా..?

సినిమా కోసం కష్టపడుతున్న అందాల భామ.. ఇంతకు ఈ ఫొటోలో ఉన్న బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా..?

ఇద్దరు క్రేజీ బ్యూటీలు కలిసి సినిమా చేస్తున్నారంటే ప్రేక్షకుల్లో ఆసక్తి మాములుగా ఉండదు. ఇప్పుడు ఇదే ఆసక్తిని ప్రేక్షకుల్లో పెంచడానికి అందాల భామలు నివేద థామస్, రెజీనా రెడీ అవుతున్నారు. 

Rajeev Rayala

|

Nov 20, 2021 | 7:59 AM

Sakini -Dakini: ఇద్దరు క్రేజీ బ్యూటీలు కలిసి సినిమా చేస్తున్నారంటే ప్రేక్షకుల్లో ఆసక్తి మాములుగా ఉండదు. ఇప్పుడు ఇదే ఆసక్తిని ప్రేక్షకుల్లో పెంచడానికి అందాల భామలు నివేదా థామస్, రెజీనా రెడీ అవుతున్నారు. నాని నటించిన జెంటిల్ మెన్ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన నివేద ఆ తర్వాత వరుస సినిమాలతో ఆకట్టుకుంది. అందం అభినయం తో ఆకట్టుకుంటున్న నివేదా స్లో అండ్ స్టడీగా సినిమాలు చేస్తూ వస్తుంది. ఇటు తెలుగుతో పాటు తమిళ్ లోనూ సినిమాలు చేసింది ఈ బ్యూటీ. సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన దర్బార్ సినిమాలో ఆయన కూతురుగా కనిపించింది నివేదా కనిపించింది. ఇక మరో బ్యూటీ రెజీనా కూడా తెలుగు సినిమాలు చేసి ఆకట్టుకుంది. కెరీర్ బిగినింగ్‌లో తెలుగులో వరుస సినిమాలు చేసిన రెజీనా ఇప్పుడు స్పీడ్ తగ్గించింది. కానీ ఈ అమ్మడికి తమిళ్ మాత్రం మంచి అవకాశాలు వస్తున్నాయి. ఈ ముద్దుగుమ్మ నటించిన నేనేనా అనే హారర్ మూవీ రిలీజ్‌కు రెడీగా ఉంది. ఎప్పుడు ఈ భామలు ఇద్దరు కలిసి సినిమా చేస్తున్నారు. ఈ సినిమా శాకిని డాకిని అనే టైటిల్ తో తెరకెక్కుతుంది.

ఓ బేబీ వంటి సూపర్ హిట్ చిత్రం తర్వాత సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలిమ్స్, క్రాస్ పిక్చర్స్ కాంబినేషన్‌లో రూపొందుతున్న రెండో చిత్రం శాకిని డాకిని. డి. సురేష్ బాబు, సునీత తాటి, హ్యున్ వ్యూ థామస్ కిమ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. టాలెంటెడ్ డైరెక్టర్ సుధీర్ వర్మ ఈ చిత్రానికి దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకోసం నివేద కఠోరంగానే శ్రమిస్తోంది. తాజాగా నివేద సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేసింది. ఫైట్ సీన్స్ కోసం నివేద ప్రాక్టీస్ చేస్తూ కనిపించింది. సెట్స్‌లో ఉన్న శాకిని డాకిని సినిమా కోసం కొన్ని రోజులుగా ప్రిపరేషన్‌లో ఉన్నాం.. మాకు ట్రైనింగ్ జరుగుతోంది అంటుంది నివేద. ఈ ఇద్దరు ముద్దగుమ్మలు కలిసి నటిస్తున్న శాకిని- డాకిని ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటుందని చిత్రయూనిట్ ధీమా వ్యక్తం చేస్తున్నారు .

మరిన్ని ఇక్కడ చదవండి : 

4 ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్న సొట్టబుగ్గల సుందరి.. కశ్మీర్‌లో షూటింగ్‌.

Priya Prakash Varrier: కైపెక్కించే కళ్లతో కుర్రాళ్ల మతిపోగొడుతున్న అందాల ప్రియా..

Anasuya Bharadwaj: చీర కట్టుతో ఫాన్స్ మనసులను దోచుకుంటున్న అను లేటెస్ట్ ఫొటోస్..

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu