4 ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్న సొట్టబుగ్గల సుందరి.. కశ్మీర్‌లో షూటింగ్‌..

Preity Zinta: బాలీవుడ్ వెటరన్ నటీమణులలో ప్రీతీ జింటా ఒకరు. ఈ నటి త్వరలో ఫిల్మ్ మేకర్స్ డానిష్ రెంజు సినిమాతో రీ ఎంట్రీ ఇస్తుంది. కాశ్మీర్ నేపథ్యంలో ఈ సినిమా

4 ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్న సొట్టబుగ్గల సుందరి.. కశ్మీర్‌లో షూటింగ్‌..
Preity
Follow us

|

Updated on: Nov 20, 2021 | 6:06 AM

Preity Zinta: బాలీవుడ్ వెటరన్ నటీమణులలో ప్రీతీ జింటా ఒకరు. ఈ నటి త్వరలో ఫిల్మ్ మేకర్స్ డానిష్ రెంజు సినిమాతో రీ ఎంట్రీ ఇస్తుంది. కాశ్మీర్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో ప్రీతీ ధైర్యవంతురాలైన కశ్మీరీ తల్లి పాత్రను పోషించనుంది. అయితే ఈ సినిమా గురించి అధికారికంగా కన్ఫర్మేషన్ రానప్పటికీ ఈ చిత్రానికి సంబంధించిన పనులు మాత్రం జరుగుతున్నాయి. ప్రీతి జింటా ఇప్పటికే ‘వీర్ జరా’, ‘మిషన్ కశ్మీర్’ వంటి చిత్రాలలో నటించింది. ఈ సినిమాలు కశ్మీర్‌ నేపథ్యంలో ఉన్నవే. అయితే ప్రస్తుతం చేసే సినిమా మొత్తం కశ్మీర్‌లోనే షూటింగ్‌ జరుపుకుంటుంది. ప్రీతి ఈ సినిమాతో పాటు ఇతర చిత్రాలలో కూడా నటించాలని కోరుకుంటుంది.

కవల పిల్లలకు తల్లి అయిన ప్రీతి.. ఇటీవల ప్రీతీ జింటా సరోగసీ ద్వారా ఇద్దరు కవల పిల్లలకు తల్లి అయింది. తన ఇన్‌స్టాగ్రామ్‌లో పిల్లల పేర్లు జై ఇంకా జియా అని వెల్లడించింది. తల్లి కావటంతో నా కొత్త ప్రయాణం మొదలైందని చెబుతూ తన భర్తతో ఉన్న ఫోటోను షేర్ చేసింది. క్యాప్షన్ ఇలా రాసింది “అందరికీ హాయ్, నేను ఈ రోజు మీ అందరితో ఒక అద్భుతమైన వార్తను షేర్‌ చేసుకుంటాను. జీన్ ఇంకా నేను చాలా సంతోషంగా ఉన్నాం. మా కవల పిల్లలను కుటుంబంలోకి ఆహ్వానిస్తున్నాం. మా జీవితంలోని కొత్త దశ కోసం మేము ఉత్సాహంగా ఉన్నాం. ఈ సందర్భంగా వైద్యులు, నర్సులు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం” అంటూ చెప్పింది. ఈ నటి తెరపై తల్లి పాత్రకు సరిగ్గా సరిపోతుంది. 4 సంవత్సరాల తర్వాత సినిమాల్లోకి తిరిగి వస్తోంది. ప్రీతి చివరిగా 2018లో ‘భయ్యాజీ సూపర్‌హిట్’లో కనిపించింది. ప్రీతి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఆమె తరచుగా తన ఫోటోలు, వీడియోలను అభిమానులతో షేర్‌ చేసుకుంటుంది.

View this post on Instagram

A post shared by Preity G Zinta (@realpz)

IND vs NZ: రెండో మ్యాచ్‌లోనూ ఉతికారేసిన ఇండియా.. న్యూజిలాండ్‌పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం..

Viral Photos: ఈ తల్లి, కూతురు ఒక మాదిరిగా కనిపిస్తారు.. ఫొటోలు చూస్తే షాక్‌ అవుతారు..

Kamala Harris: కమలా హారిస్‌కి అమెరికా అధ్యక్ష బాధ్యతలు.. కారణాలు ఇలా ఉన్నాయి..?