Akhanda Collections: తెలుగు సినిమాకు ఊపిరి పోసిన బాలయ్య.. ‘అఖండ’తో కలెక్షన్ల ఊచకోత

Akhanda Collections: తెలుగు సినిమాకు ఊపిరి పోసిన బాలయ్య.. 'అఖండ'తో కలెక్షన్ల ఊచకోత
Akhanda Mass Hit

బాలయ్య దుమ్ములేపుతున్నాడు. అఘోరాగా అదరగొడుతున్నాడు. అఖండగా బాక్సాఫీస్ లెక్కలు తేలుస్తున్నాడు.

Ram Naramaneni

|

Dec 03, 2021 | 12:03 PM

బాలయ్య దుమ్ములేపుతున్నాడు. అఘోరాగా అదరగొడుతున్నాడు. అఖండగా బాక్సాఫీస్ లెక్కలు తేలుస్తున్నాడు. యస్.. బాలయ్య థియేటర్ల వద్ద సింహ గర్జన చేస్తున్నారు. కలెక్షన్ల ఊచకోత మొదలెట్టాడు. డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చిన అఖండ మాస్ ఆడియెన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఫ్యాన్స్ గురించి అయితే చెప్పాల్సిన పనిలేదు. బాలయ్య కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ కొట్టాడని కాలర్ ఎగరేస్తున్నారు. బొయపాటి మార్క్ ఎలివేషన్స్‌ను జనాలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడక్కడా ఫైట్స్ కొంచెం ఓవర్ అయ్యాయన్న మాటలు వినిపిస్తున్నా.. బాలయ్య అంటే ఆ మాత్రం ఉండాలి అంటున్నారు ఫ్యాన్స్. క్రాక్ తర్వాత టాలీవుడ్‌లో  ఆ రేంజ్ మాస్ సినిమా రాలేదు. తాజాగా బాలయ్య మరోసారి అన్ని లెక్కలు తేల్చేశాడు. తెలుగు సినిమాకు ఊపిరి పోశాడు. ఓవరాల్‌గా మౌత్ టాక్ బాగుందని రావడంతో.. జనాలు సినిమా చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఊహించని విధంగా చాలా థియేటర్లలో హౌస్‌ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. ఈ బోర్డ్స్ తెలుగు రాష్ట్రాల్లో కనబడి చాలా రోజులైందనే చెప్పాలి. మొత్తంగా డిసెంబర్ 2న తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్ల వద్ద మాస్ జాతర నడిచింది. దీంతో ఊహించిన దానికంటే కలెక్షన్లు కాస్త ఎక్కువే వచ్చినట్లు తెలుస్తోంది. టోటల్‌గా ఈ మూవీకి 23 కోట్ల గ్రాస్, 15.39 నెట్ వసూళ్లు వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి.

తెలుగు రాష్ట్రాల్లో ఏరియాల వారిగా కలెక్షన్స్ వివరాలు ఇలా ఉన్నాయి… నైజాం- 4.39 కోట్లు సీడెడ్- 4.02 కోట్లు ఉత్తరాంధ్ర- 1.36 కోట్లు ఈస్ట్ గోదావరి- 1.05 కోట్లు వెస్ట్ గోదావరి- 96 లక్షలు గుంటూరు- 1.87 కోట్లు కృష్ణా- 81 లక్షలు నెల్లూరు- 93 లక్షలు

అఖండ 53 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది. అంటే.. 54 కోట్లు వసూలు చేస్తే బ్రేక్ ఈవెన్‌లోకి వెళ్తుంది. హిట్ టాక్‌తో పాటు మరో సినిమా పోటీలో లేదు. వీకెండ్ హాలిడేస్ కూడా ఉండనే ఉన్నాయి. దీంతో ఈ వారంతం ముగిసేసరికి బాలయ్య సినిమా బ్రేక్ ఈవెన్ క్రాస్ చేస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

Also Read:  మా సౌండ్ బాక్సులు డ్యామేజ్ అవుతాయ్.. యూఎస్‌లో నోటీసు బోర్డ్స్.. అల్లాడిచ్చిన తమన్

Akhanda: ‘బాలా బాబాయి చింపేశావ్’.. వైరల్ అవుతోన్న జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu