`మన్మథుడు2` రిలీజ్ డేట్ ఫిక్స్!
కింగ్ నాగార్జున కథానాయకుడిగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం `మన్మథుడు2`. రకుల్‌ప్రీత్‌సింగ్ కథానాయిక. సమంత, కీర్తిసురేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ప్రోమోస్ సినిమాపై అంచనాలను భారీగా పెంచాయి. నాగార్జున తన గ్లామర్ లుక్‌తో సిక్టీస్‌లో కూడా ప్రజంట్ జనరేషన్ అమ్మాయిలను ఎట్రాక్ట్ చేస్తున్నాడు. తాజాగా మూవీ యూనిట్ చిత్ర రిలీజ్ ముహూర్తాన్ని కూడా ప్రకటించారు. ఆగస్టు 9న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు నాగర్జున ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ‘చి.ల.సౌ`తో విజయాన్ని అందుకున్న […]
కింగ్ నాగార్జున కథానాయకుడిగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం `మన్మథుడు2`. రకుల్‌ప్రీత్‌సింగ్ కథానాయిక. సమంత, కీర్తిసురేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ప్రోమోస్ సినిమాపై అంచనాలను భారీగా పెంచాయి. నాగార్జున తన గ్లామర్ లుక్‌తో సిక్టీస్‌లో కూడా ప్రజంట్ జనరేషన్ అమ్మాయిలను ఎట్రాక్ట్ చేస్తున్నాడు. తాజాగా మూవీ యూనిట్ చిత్ర రిలీజ్ ముహూర్తాన్ని కూడా ప్రకటించారు. ఆగస్టు 9న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు నాగర్జున ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ‘చి.ల.సౌ`తో విజయాన్ని అందుకున్న రాహుల్ రవీంద్రన్, రెండో ప్రయత్నంగా చేసిన చిత్రమిది.
కాాగా టీజర్ విడుదలప్పుడే మూవీ రిలీజ్ డేట్‌ను ఆగస్టు 9గా ఫిక్స్ చేశారు. ఆగస్ట్ 15న ప్రభాస్ ”సాహో’ రిలీజవుతుందని తెలుసు కదా..ఆ తర్వాత కన్వీనియంట్‌ను బట్టి ‘మన్శథుడు 2’ ను పోస్టు పోన్ చేస్తారు అనుకున్నారు. కానీ నాగ్ అస్సలు తగ్గట్లేదు. జూలై నెల నుండి బాక్సాఫీస్ వద్ద సినిమాల తాకిడి ఓ రేంజ్ లో ఉంది. జూలై 18న ‘ఇస్మార్ట్ శంకర్’, 25న విజయ్ దేవరకొండ ‘డియర్ కామ్రేడ్’, ఆగస్ట్ 2న ‘రణరంగం’, ‘రాక్షసుడు’, ‘గుణ 369’, ఆగస్ట్ 9న ‘మన్మథుడు 2’, 15న ‘సాహో’, 31న ‘గ్యాంగ్ లీడర్’, ఆ తరువాత సెప్టెంబర్ మొదటి వారంలో ‘వాల్మీకి’ ఇలా చాలా సినిమాలు రిలీజ్ కి ఉన్నాయి. ఆగస్ట్ 9న న గనుక మిస్ అయితే దాదాపు నెల రోజుల వరకు వాయిదా వేయాల్సివుంటుందని అందుకే చెప్పిన డేట్ కి రావాలని నాగ్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.
August 9th here we come!! And the laughter begins!!#Manmadhudu2 #Manmadhudu2OnAugust9th@rakulpreet @vennelakishore @23_rahulr @Annapurnastdios @AnandiArtsOffl @Viacom18Studios @mynnasukumar. @chaitanmusic @ChotaKPrasad @iaksharagowda pic.twitter.com/Ab0Pc8L0Cz
— Nagarjuna Akkineni (@iamnagarjuna) July 15, 2019