AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Phalana Abbayi Phalana Ammayi Teaser: ఆకట్టుకుంటున్న ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ టీజర్.. మీరు చూశారా ?..

ఇప్పుడు 'ఫలానా అబ్బాయి ఫలానా అబ్బాయి'తో నాగశౌర్య-శ్రీనివాస్ అవసరాల హ్యాట్రిక్ విజయాన్ని అందుకోవడానికి సిద్ధమవుతున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్.

Phalana Abbayi Phalana Ammayi Teaser: ఆకట్టుకుంటున్న 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి' టీజర్.. మీరు చూశారా ?..
Phalana Abbayi Phalana Amma
Rajitha Chanti
|

Updated on: Feb 09, 2023 | 9:24 PM

Share

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, దాసరి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఫీల్ గుడ్ రొమాంటిక్ ఫిల్మ్ ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’. శ్రీనివాస్ అవసరాల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ‘కళ్యాణ వైభోగమే’ చిత్రంతో వెండితెరపై మ్యాజిక్‌ చేసిన హిట్ పెయిర్ నాగశౌర్య, మాళవిక నాయర్ ఈ చిత్రంలో హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. గూఢచారి, ఓ బేబీ వంటి అనేక విజయాలను కలిగి ఉన్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ 2022లో ‘ధమాకా’, ‘కార్తికేయ 2’ చిత్రాలతో మరో రెండు భారీ విజయాలను అందుకుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ సినిమాపై ఆసక్తిని కలిగించాయి. ఇప్పుడు ‘ఫలానా అబ్బాయి ఫలానా అబ్బాయి’తో నాగశౌర్య-శ్రీనివాస్ అవసరాల హ్యాట్రిక్ విజయాన్ని అందుకోవడానికి సిద్ధమవుతున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్.

తాజాగా విడుదలైన టీజర్ లో నాగశౌర్య చాలా కూల్ గా కనిపిస్తున్నారు. వీరిద్దరు మంచి స్నేహితులుగా పరిచయం కాబోతున్నారు. అలాగే మాళవిక నాయర్ కూడా మరింత అందంగా కనిపిస్తోంది. అయితే ఈ వీడియోలో కథ పెద్దగా రివీల్ చేయనప్పటికీ టీజర్ కట్ బాగుంది. మరోసారి తన డైలాగ్స్‌తో, ఇంట్రెస్టింగ్ క్యారెక్టరైజేషన్స్‌ తో శ్రీనివాస్ అవసరాల ఆకట్టుకున్నాడు. ఈ చిత్రానికి దర్శకత్వం వహించడంతో పాటు శ్రీనివాస్ అవసరాల కీలక పాత్ర పోషిస్తున్నారు.

కళ్యాణి మాలిక్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ‘ఉగాది’ కానుకగా మార్చి 17వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.