- Telugu News Photo Gallery Cinema photos Actress Janhvi Kapoor Said About Negativ Comments And trolls hurts her telugu cinema news
Janhvi Kapoor: ఆ మాటలు చాలా ఎక్కువగా బాధిస్తాయి.. జాన్వీ కపూర్ ఎమోషనల్..
దివంగత హీరోయిన్ శ్రీదేవి వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది జాన్వీ కపూర్. ధడక్ సినిమాతో కథానాయికగా అలరించిన ఈ చిన్నది ఆ తర్వాత వరుస చిత్రాలతో ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
Updated on: Feb 09, 2023 | 9:58 PM

దివంగత హీరోయిన్ శ్రీదేవి వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది జాన్వీ కపూర్. ధడక్ సినిమాతో కథానాయికగా అలరించిన ఈ చిన్నది ఆ తర్వాత వరుస చిత్రాలతో ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

అయితే నటిగా ఎంట్రీ ఇచ్చిన సమయం నుంచి తరచూ విమర్శలు, ట్రోల్స్ ఎదుర్కొంటున్నానని.. కొన్ని సార్లు ఆ మాటలు బాధిస్తాయని అన్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్స్ చేశారు.

తనపై వచ్చే ట్రోల్స్ చూసి విసిగిపోయినట్లు తెలిపింది. ఎంత కష్టపడినా అందులో తప్పులు వెతుకుతూ విమర్శిస్తూనే ఉంటారని వాపోయింది.

మనం ఏం చేసినా.. ఎంత కష్టపడినా కొందరు అందులో తప్పులు వెతుకుతూ ఉంటారు. ఎప్పుడూ సూటిపోటి మాటలతో బాధపెడుతుంటారు. మనల్ని ఎంతగా ట్రోల్ చేస్తే వారికి అంత సంతోషం. విమర్శించడంలో వారు ఆనందం పొందుతారు.

మనపై చేసే కామెంట్లతో వార్తల్లో నిలుస్తారు. ఇది నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. కానీ ఇలాంటి వార్తలు చదివి, చదివి కొంతకాలానికి ప్రజలు విసిగిపోతారు. దురదృష్టం ఏంటంటే మనపై వచ్చే ట్రోల్స్ కూడా ప్రజలను విసిగిపోయేలా చేస్తాయి అంటూ చెప్పుకొచ్చింది.

ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పటి నుంచి విమర్శలు ఎదుర్కొంటూనే ఉన్నాను. నెపోకిడ్ అంటూ ట్రోల్ చేస్తూనే ఉన్నారని... సినిమాలు రిలీజ్ అయినప్పుడు నెపోకిడ్ నటన రానప్పుడు ఎందుకు సినిమాలు చేస్తున్నావంటూ కామెంట్స్ చేస్తారని అన్నారు.

అలాంటి ట్రోల్స్, కామెంట్స్ చూసి బాధపడుతుంటానని.. నా బలాలు, బలహీనతలు నేను ఎలా నటిస్తున్నానో నాకు తెలుసంటూ చెప్పుకొచ్చింది జాన్నీ.

ఆ మాటలు చాలా ఎక్కువగా బాధిస్తాయి.. జాన్వీ కపూర్ ఎమోషనల్..

ఆ మాటలు చాలా ఎక్కువగా బాధిస్తాయి.. జాన్వీ కపూర్ ఎమోషనల్..




