Naga Shaurya: కుర్రహీరో ఇంట పెళ్లిబాజాలు.. నాగశౌర్య పెళ్లాడబోయే అమ్మాయి ఎవరంటే

వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు శౌర్య.

Naga Shaurya: కుర్రహీరో ఇంట పెళ్లిబాజాలు.. నాగశౌర్య పెళ్లాడబోయే అమ్మాయి ఎవరంటే
Naga Shourya
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 20, 2022 | 12:12 PM

టాలీవుడ్ టాలెంటెడ్ యంగ్ హీరోల్లో నాగశౌర్య ఒకరు. ‘క్రికెట్, గర్ల్స్ అండ్ బీర్’ అనే చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన నాగశౌర్య. ఊహలు గుసగుసలాడే సినిమాతో హీరోగా బ్రేక్ అందుకున్నాడు.. వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు శౌర్య. ఆ తర్వాత ‘దిక్కులు చూడకు రామయ్య’ ‘ఓ బేబీ’ ‘ఛలో’ వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించాడు. రీసెంట్ గా కృష్ణ వ్రింద విహారి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ కుర్ర హీరో పెళ్లి పీటలెక్కనున్నాడని తెలుస్తోంది. త్వరలోనే నాగ శౌర్య పెళ్లికొడుకుగా మారనున్నాడని తెలుస్తోంది. నాగ శౌర్య పెళ్ళికి సంబంధించిన వార్త ఇప్పుడు ఫిలిం సర్కిల్స్ లో తెగ చక్కర్లు కొడుతోంది.

అనూష అనే యువతిని నాగశౌర్య పెళ్ళడబోతున్నడని తెలుస్తోంది. నవంబర్ 20న బెంగళూర్ లో ఉదయం 11 గంటల 25 నిమిషాలకు ఘనంగా జరగబోతోంది. ఇక 19న మెహందీ ఫంక్షన్ … సంగీత్ వంటి కార్యక్రమాలతో నాగ శౌర్య పెళ్లి సందడి మొదలు కాబోతుంది. శౌర్య పెళ్లి ఘనంగా జరిపేందుకు ఆయన తల్లిదండ్రులు ఏర్పాట్లు చేస్తున్నారు.

ప్రస్తుతం అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం చిత్రం షూటింగ్లో బిజీగా గడుపుతున్నాడు. అలాగే నారి నారి నడుమ మురారి, పోలీసు వారి హెచ్చరిక వంటి సినిమాల్లో నటిస్తున్నాడు.

ఇవి కూడా చదవండి