Lockdown: ట్విట్టర్‌లో ఒక్కసారిగా ట్రెండింగ్‌లోకి ‘ఇండియా లాక్‌డౌన్’.. ఇంతకీ అసలు విషయం ఏంటంటే..
కరోనా అనే ఒక్క పదం ప్రపంచాన్ని అతలాకుతలం చేసేసింది. కంటికి కనిపించని ఓ చిన్న వైరస్ ప్రపంచదేశాలన్నింటినీ అతలాకుతలం చేసేసింది. ఆరోగ్యం నుంచి ఆర్థికం వరకు అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపింది. అయితే ప్రస్తుతం పరిస్థితుల్లో మార్పులు వచ్చాయి. వ్యాక్సిన్ అందుబాటులోకి రావడంతో..
కరోనా అనే ఒక్క పదం ప్రపంచాన్ని అతలాకుతలం చేసేసింది. కంటికి కనిపించని ఓ చిన్న వైరస్ ప్రపంచదేశాలన్నింటినీ అతలాకుతలం చేసేసింది. ఆరోగ్యం నుంచి ఆర్థికం వరకు అన్ని రంగాలపై కరోనా తీవ్ర ప్రభావం చూపింది. అయితే ప్రస్తుతం పరిస్థితుల్లో మార్పులు వచ్చాయి. వ్యాక్సిన్ అందుబాటులోకి రావడంతో మళ్లీ మనుపటి పరిస్థితుల్లోకి క్రమంగా వెళ్లిపోతున్నాం. అయితే ఉన్నట్టుండి ఒక్కసారిగా ట్విట్టర్‌లో ‘ఇండియా లాక్ డౌన్’ అనే ట్యాగ్ ట్రెండింగ్‌లో దూసుకుపోయింది.
దీంతో నెటిజన్లు ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు. మళ్లీ లాక్‌డౌన్ ఏంటీ సామీ అన్న చర్చ మొదలైంది. దీంతో ఉన్నట్టుండి ఈ లాక్‌డౌన్ ట్యాగ్ ఎందుకు ట్రెండ్ అవుతోన్న దానిపై నెటిజన్లు వెతకడం మొదలు పెట్టారు. అయితే భయపడాల్సిన అవసరం లేదు. ఇది కరోనా వైరస్‌తో వచ్చే లాక్‌డౌన్ కాదని, ఓ సినిమా టైటిల్ అని తేలిపోయింది. ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 ‘ఇండియా లాక్‌డౌన్’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తోంది.
కరోనా కారణంగా తొలిసారి విధించిన లాక్‌డౌన్ ఇతివృత్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఒక్కసారిగా లాక్‌డౌన్ విధించిన సమయంలో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆయా రంగాల వారి జీవన స్థితిగతులపై లాక్‌డౌన్ ఎలాంటి ప్రభావం చూపిందన్న విషయాలను ఈ చిత్రంలో చూపించారు. తాజాగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేయడంతో ట్విట్టర్‌లో రెండు రోజుల క్రితం లాక్ డౌన్ ఇండియా ట్రెండ్ అయ్యింది.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..