Samantha Ruth Prabhu: లేటెస్ట్ ఫోటో షేర్ చేసిన సమంత.. షాక్ అవుతున్న నెటిజన్లు

సమంత అరుదైన మయోసైటిస్ డిసీజ్‌ తో బాధపడుతోంది. ఈ వ్యాధి కారణంగా కండరాలు బలహీనంగా అవుతాయి. ప్రస్తుతం ఈ వ్యాధికి చికిత్స తీసుకుంటుంది సమంత.

Samantha Ruth Prabhu: లేటెస్ట్ ఫోటో షేర్ చేసిన సమంత.. షాక్ అవుతున్న నెటిజన్లు
Samantha
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 10, 2022 | 3:33 PM

స్టార్ హీరోయిన్ సమంత గురించి నిత్యం ఎదో ఒక వార్త హల్ చల్ చేస్తూనే ఉంది. సామ్ ఇటీవల అనారోగ్యానికి గురైన విషయం తెలిసిందే. సమంత అరుదైన మయోసైటిస్ డిసీజ్‌ తో బాధపడుతోంది. ఈ వ్యాధి కారణంగా కండరాలు బలహీనంగా అవుతాయి. ప్రస్తుతం ఈ వ్యాధికి చికిత్స తీసుకుంటుంది సమంత. సామ్ అనారోగ్యానికి గురైందని తెలిసిన దగ్గర నుంచి ఆమె అభిమానులు ఆందోళనపడుతున్నారు. త్వరగా కోలుకుంటావ్ సామ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఇక సమంత నటించిన యశోద సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ ఇటీవలే మొదలయ్యాయి. ఈ మూవీ ప్రమోషన్స్ లో సామ్ పాల్గొంటుంది. తాజాగా యశోద సినిమా ప్రమోషన్స్ లో భాగంగా జరిగిన ఇంటర్వ్యూలో సమంత తన వ్యాధి గురించి.. తాను ఎదుర్కొన్న పరిస్థితుల గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యి కన్నీళ్లు పెట్టుకుంది.

ఒకొక్కసారి మరో అడుగు వేస్తే బాగుండు అని అనిపించేది అని.. కొన్నిసార్లు ఇక్కడి వరకు రాగలిగాను అని అనిపిస్తుందని ఎమోషనల్ అయ్యింది. ఇక తాజాగా సమంత షేర్ చేసిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వ్యాధి తర్వాత సమంతలో మార్పులు కనిపిస్తున్నాయి. తాజాగా షేర్ చేసిన ఫోటో చూసి కూడా నెటిజన్లు అదే అంటున్నారు.

ఇవి కూడా చదవండి

తాజాగా..  చాలా ఉత్కంఠగా ఉందని.. యశోద సినిమాకు సంబంధించి ఇంక మా చేతుల్లో ఏం లేదంటూ.. ఇంకో ఫొటో పోస్ట్ చేసింది. ఈ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫోటో పై నెటిజన్లు స్పందిస్తూ.. డిసీజ్ తో బాధపడుతున్నప్పటికీ సామ్ సినిమా కోసం చేస్తున్న ప్రమోషన్స్.. ఆమె డెడికేషన్ కు సలాం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అలాగే గెట్ వెల్ సూన్ అని కామెంట్స్ చేస్తున్నారు సామ్ ఫ్యాన్స్..

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..