AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Krishna Vrinda Vihari: కృష్ణ వ్రింద విహారి సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్.. ఆకట్టుకుంటున్న నాగశౌర్య లుక్..

యంగ్ హీరో నాగశౌర్యకు (Naga Shaurya) ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కంటెంట్ ప్రాధాన్యత ఉన్న

Krishna Vrinda Vihari: కృష్ణ వ్రింద విహారి సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్.. ఆకట్టుకుంటున్న నాగశౌర్య లుక్..
Nagashaurya
Rajitha Chanti
|

Updated on: Mar 07, 2022 | 6:15 PM

Share

యంగ్ హీరో నాగశౌర్యకు (Naga Shaurya) ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కంటెంట్ ప్రాధాన్యత ఉన్న స్టోరీలతో ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. ఇటీవలే వరుడు కావలెను.. లక్ష్య, అశ్వథ్థామ వంటి సినిమాలతో హిట్ కొట్టాడు హీరో నాగశౌర్య. వైవిధ్యమైన సబ్జెక్టులతో విభిన్న పాత్రలు పోషిస్తున్న నాగశౌర్య ప్రస్తుతం నటిస్తోన్న చిత్రం కృష్ణ వ్రింద విహారి. ఈ చిత్రానికి అనీష్ ఆర్.కృష్ణ దర్శకత్వం వహిస్తుండగా.. ఇందులో షెర్లీ సెటియా హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాను ఐరా క్రియేషన్స్ బ్యానర్ పై ఉషా మూల్పూరి నిర్మిస్తున్నారు.

తాజాగా సోమవారం ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. కృష్ణ వ్రింద విహారి వేసవి కానుకగా ఏప్రిల్ 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. విడుదల తేదీని ప్రకటించిన పోస్టర్లో నాగ శౌర్య, చిత్ర నాయిక షిర్లీ సెటియా స్కూటర్ పై వెళుతున్నట్లు కనిపిస్తోంది. శౌర్య, షిర్లీ సెటియా ఇద్దరూ సంప్రదాయ దుస్తులలో చూడముచ్చటగా ఉన్నారు. పోస్టర్ని బట్టి చూస్తే, సినిమాలో వీరిద్దరూ అద్భుతమైన కెమిస్ట్రీ ని పంచుకున్నట్లు కనిపిస్తోంది. గతంలో విడుదలైన ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ కి అద్భుతమైన స్పందన వచ్చింది. తొలిసారిగా నాగ శౌర్య ఈ చిత్రంలో ఇటువంటి పాత్రను పోషిస్తున్నాడు. ఇంతకుముందు సినిమాలలో అతని పాత్రలకు భిన్నంగా, వినోదభరితమైన పాత్రలో కనిపించనున్నాడు. ఈ చిత్రాన్ని ఉషా ముల్పూరి నిర్మిస్తుండగా, శంకర్ ప్రసాద్ ముల్పూరి సమర్పిస్తున్నారు. ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ స్వరాలు సమకూరుస్తుండగా, సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఇందులో స్టార్ కమెడియన్లు వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, సత్య నటించడం వల్ల ఈ సినిమా హాస్యభరితంగా ఉంటుందని అర్థం అవుతోంది.

Also Read: Akhil Agent: అఖిల్ సినిమాలో మాలీవుడ్ మెగాస్టార్.. ఏజెంట్ మూవీ నుంచి స్పెషల్ సర్‏ప్రైజ్..

సినిమా టికెట్ ధరలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. జీవో జారీ అయ్యేది ఎప్పుడంటే..

Prabhas: సినిమా టికెట్ ధరలపై స్పందించిన ప్రభాస్.. ఏపీ ప్రభుత్వం అలా చేస్తే సంతోషిస్తామంటూ..

Nithiin: నితిన్ సినిమాలో బాలీవుడ్ క్రేజీ బ్యూటీ.. మాచర్ల నియోజక వర్గంలో స్పెషల్ సాంగ్ ?..