AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bheemla Nayak: భీమ్లానాయక్ ఎఫెక్ట్.. పవన్ ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చిన పోలీసులు.. వారందిరిపైనా..

Bheemla Nayak: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు చిత్తూరు పోలీసులు ఊహించని ఝలక్ ఇచ్చారు. పవన్‌పై అభిమానంతో మూగ జంతువును బలి ఇచ్చిన అభిమానులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

Bheemla Nayak: భీమ్లానాయక్ ఎఫెక్ట్.. పవన్ ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చిన పోలీసులు.. వారందిరిపైనా..
Pawan Kalyan
Shiva Prajapati
|

Updated on: Mar 07, 2022 | 6:27 PM

Share

Bheemla Nayak: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు చిత్తూరు పోలీసులు ఊహించని ఝలక్ ఇచ్చారు. పవన్‌పై అభిమానంతో మూగ జంతువును బలి ఇచ్చిన అభిమానులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సాధారణంగానే తమ అభిమాన హీరో సినిమా విడుదలైతే అభిమానులు చేసే హడావుడి అంతా ఇంతా ఉండదు. సినిమా థియేటర్ల వద్ద భారీ కటౌట్లు ఏర్పాటు చేయడం, పాలాభిషేకం, దండలు వేయడం, టపాకాయలు కాల్చడం చేస్తూ సంబరాలు జరుపుకుంటారు. తమ అభిమాన హీరో సినిమా హిట్ కావాలనే ఉద్దేశ్యంతో గుమ్మడికాయలతో దిష్టి కూడా తీస్తుంటారు. అయితే, తాజాగా పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లానాయక్ సినిమా విడుదల సందర్భంగా ఆయన అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఆ అత్యుత్సాహమే.. వారిపై కేసు నమోదు అయ్యేలా చేసింది.

చిత్తూరు జిల్లా పీలేరులో పవన్ కళ్యాణ్ అభిమానులపై కేసు నమోదు అయ్యింది.  భీమ్లా నాయక్ సినిమా విడుదల సందర్భంగా పీలేరులోని సీఎస్ఎన్ థియేటర్ వద్ద పలువురు అభిమానులు మేకను బలి ఇచ్చారు. దీనిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అదికాస్తా వైరల్ అయ్యింది. అయితే, జంతుబలిని వ్యతిరేకిస్తూ.. పలువురు జంతు ప్రేమికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీరి ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్న పోలీసులు.. జంతుబలి ఇచ్చిన పవన్ అభిమానులపై కేసు నమోదు చేశారు. ఐపీసీ 429 రెడ్ విత్ 34, ఆర్మ్స్ యాక్ట్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. జంతుబలి కార్యక్రమంలో పాల్గొన్న వారిని గుర్తించే పనిలో పడ్డారు. వీడియో ఆధారంగా మేకను బలి ఇచ్చిన వారిని గుర్తిస్తామని పోలీసులు తెలిపారు.

కాగా, జంతుబలి విషయంలో పవన్ కళ్యాణ్ అభిమానులపై కేసు నమోదు కావడం చర్చనీయాంశంగా మారింది. కేసు నమోదు చేసిన పోలీసుల అత్యుత్సాహంపై పవన్ అభిమానులు భగ్గుమంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచి పవన్‌పై క్షక్ష పూరితంగా వ్యవహరిస్తోందని, ఇందులో భాగంగానే పవన్ అభిమానులపై తాజాగా కేసులు నమోదు అని ఆరోపిస్తున్నారు.

కాగా, జనసేన అధినేత, టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లానాయక్ సినిమా ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. రిలీజ్ మొదలు.. ఈ సినిమాకు అభిమానుల నుంచి మంచి ఆధరణ వస్తోంది. సినిమా అదుర్స్ అంటూ అభిమానులు ఉర్రూతలూగిపోతున్నారు.

Also read:

Vehicle Tires: టైర్లు నలుపు రంగులో ఎందుకు ఉంటాయి.. అసలైన కారణాలు ఏమిటో తెలిస్తే..

Cancer: ఈ ఐదు రకాల ఆహార పదార్థాలు తీసుకుంటే క్యాన్సర్ రాకుండా చూసుకోవచ్చు..!

Viral Video: యుద్ధం మమ్మల్ని విడదీయలేదు.. రణ క్షేత్రంలోనే ఒక్కటైన ఉక్రెయిన్ ప్రేమ జంట.. వీడియో