AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Thandel Movie: ఇక నాగ చైతన్య ఫ్యాన్స్‌ కాలర్ ఎగరేసుకోవచ్చు.. కలెక్షన్లలో అరుదైన ఘనత అందుకున్న తండేల్

ఇక అక్కినేని నాగ చైతన్య ఫ్యాన్స్ కూడా గర్వంగా కాలర్ ఎగరేసుకోవచ్చు. అవును అతను నటించిన లేటెస్ట్ సినిమా తండేల్ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టుతోంది. తాజాగా ఈ సినిమా మరో మైలురాయిని చేరుకుంది. దీంతో అక్కినేని ఫ్యాన్స్ తెగ హ్యాపీగా ఫీలవుతున్నారు.

Thandel Movie: ఇక నాగ చైతన్య ఫ్యాన్స్‌ కాలర్ ఎగరేసుకోవచ్చు.. కలెక్షన్లలో అరుదైన ఘనత అందుకున్న తండేల్
Thandel Movie
Basha Shek
|

Updated on: Feb 16, 2025 | 8:02 PM

Share

యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య నటించిన తాజా చిత్రం తండేల్. చందూ మొండేటి తెరకెక్కించిన ఈ ఎమోషనల్ లవ్ స్టోరీలో న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి కథానాయికగా నటించింది. లవ్ స్టోరీ తర్వాత చైతన్య, సాయి పల్లవి ల కాంబినేషన్ లో వచ్చిన రెండో చిత్రమిది. రిలీజ్ కు ముందే తండేల్ మూవీ నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్, ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. అందుకు తగ్గట్టుగానే ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకెళుతోంది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది. ఓవైపు సినిమా హెచ్ డీ వెర్షన్ లు ఆన్ లైన్ లో లీకయినా ఆడియెన్స్ థియేటర్లలో ఈ సినిమాను చూసేందుకు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో నాగ చైతన్య సినిమా కలెక్షన్లలో కొత్త రికార్డులు నెలకొల్పుతోంది. తాజాగా ఈ సినిమా వంద కోట్ల క్లబ్ లో చేరింది. కేవలం 10 రోజుల్లోనే రూ. 100 కోట్ల గ్రాస్‌ దాటింది. ఈ విషయాన్ని చిత్ర బృందం సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించింది. ‘బాక్స్ ఆఫీస్ దుళ్లకొట్టేసారు.. థియేటర్స్ కి జాతర తెచ్చేసారు. తండేల్ బ్లాక్ బస్టర్ సునామీ. ప్రపంచ వ్యాప్తంగా 100 కోట్ల గ్రాస్ దాటేసింది’ అంటూ తండేల్ చిత్ర బృందం హర్షం వ్యక్తం చేసింది.

కాగా నాగ చైతన్య తో పాటు అక్కినేని ఫ్యామిలీలో ఇదే మొదటి వంద కోట్ల సినిమా. దీంతో నాగ చైతన్య అభిమానులు తెగ హ్యపీగా ఫీలవుతున్నారు. ఇక ఓవర్సీస్‌లో తండేల్ రికార్డులు కొల్లగొడుతోంది. ఇప్పటికే అక్కడ 1 మిలియన్ దాటింది. మొత్తానికి ఇప్పటికే బ్రేక్ ఈవెన్ అయ్యి లాభాల బాటల పయనిస్తోంది తండేల్.

ఇవి కూడా చదవండి

10 రోజుల్లోనే..

కాగా గీతా ఆర్ట్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో బన్నీ వాసు, అల్లు అరవింద్ కలిసి తండేల్ సినిమాను నిర్మించారు. నాగ చైతన్య, సాయి పల్లవిలతో పాటు కరుణాకరణ్, ప్రకాశ్ బెలావాడి, దివ్య పిళ్లై, పృథ్వీ, కళ్యాణీ నటరాజన్, కల్పలత తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. దేవి శ్రీ ప్రసాద్ అందించిన పాటలు చార్ట్ బస్టర్ గా నిలిచాయి. సినిమా విజయంలో పాటలు కూడా కీలక పాత్ర పోషించాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..